PhonePe యూజర్లకు షాక్.. ఇకపై ఛార్జీలు వసూలు

దేశంలో అతిపెద్ద యూపీఐ ప్లాట్ ఫామ్ ఫోన్ పే. ఎంతో మంది దీన్ని వాడుతున్నారు. ఫోన్ పే ద్వారా గ్రాసరీ స్టోర్‌లో చెల్లింపుల నుంచి మనీ ట్రాన్స్‌ఫర్, బిల్లుల చెల్లింపు వరకు పలు రకాల సేవలు పొందొచ్చు. అయితే, ఫోన్ పే తన యూజర్లకు షాక్ ఇచ్చిందని చెప్పాలి.


ఫోన్ పే ప్రయోగాత్మకంగా ఛార్జీలు వసూలు చేస్తోంది. ఎంపిక చేసిన కొందరు కస్టమర్లు రూ.50 నుంచి రూ.100 లోపు రీఛార్జీ చేసుకుంటే 1 రూపాయి… రూ.100 కంటే ఎక్కువైతే రూ.2ను ఫీజుగా వసూలు చేస్తోంది. ఇంతకాలంగా నిర్వహణ వ్యయం ఉన్నా ఈ సంస్థ ఉచితంగానే యూజర్లకు సేవలు అందిస్తోంది. అయితే ఖర్చులు తగ్గించుకునేందుకు ఇప్పటికే ప్రమోషన్లను సగానికి తగ్గించిన ఫోన్ పే.. తాజాగా ఈ ఛార్జీలు వసూలు అమలు చేస్తోంది.

”ఇది ప్రయోగంలో భాగం. ఎంపిక చేసిన యూజర్ల నుంచి మాత్రమే చార్జీలు వసూలు చేస్తున్నాం. కొంతమంది నుంచి చార్జీలు వసూలు చేయాలా? ఎక్కువమంది నుంచి వసూలు చేయాలా? అనేది ఇంకా నిర్ణయించలేదు” అని ఫోన్ పే ప్రతినిధి ఒకరు చెప్పారు.

గతవారం ఫోన్ 44శాతం(రూ.888 కోట్లు) నష్టాలను చవి చూసింది. అదే సమయంలో రెవెన్యూ 84శాతానికి(రూ.690 కోట్లు) పెరిగింది. ఇతర అనేక ఫిన్ టెక్స్ తరహాలోనే యూజర్లకు ఉచితంగా సేవలు అందిస్తోంది. నిర్వహణ ఖర్చులు ఉన్నప్పటికీ ఉచితంగానే సర్వీస్ చేస్తోంది. మార్కెట్ లో షేర్ పొందేందుకు ఇదొక స్ట్రాటజీ.

యూపీఐ ప్లాట్ ఫామ్ లో ఫోన్ ఫే ప్రస్తుతం లీడర్ గా ఉంది. సెప్టెంబర్ లో 165 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఆ తర్వాత గూగుల్ పే ఉంది. ఐపీఓ బౌండ్ పేటీఎం 9శాతం మార్కెట్ షేర్ కలిగుంది. పీర్ టు మర్చంట్, ఇతర ట్రాన్సాక్షన్లపై ఫోకస్ పెట్టింది. క్రెడిట్ కార్డు ద్వారా ఈ వ్యాలెట్ లోకి డబ్బు పంపుకోవాలంటే పేటీఎం ఇప్పటికే చార్జీలు వసూలు చేస్తోంది. అయితే పేమెంట్స్ కు ఎలాంటి ప్లాట్ ఫామ్ చార్జ్ చేయడం లేదు. చాలా వరకు టెక్నాలజీ కంపెనీలు కస్టమర్లను రీటైన్ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాయి.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad