వాట్సాప్ అదిరిపోయే ఆఫర్… రూ.1 పంపిస్తే.. రూ.51 క్యాష్ బ్యాక్
యూపీఐ లావాదేవీలు జరిపేవారికి గూగుల్ పే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్ పే యాప్ ప్రారంభంలో (అప్పట్లో ‘తేజ్’ యాప్) స్క్రాచ్ కార్డు ఆఫర్ ద్వారా తెగ పాపులర్ అయ్యింది. ఇప్పుడు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా గూగుల్ పే దారినే నమ్ముకుంది. వాట్సాప్ కూడా పేమెంట్స్ కేటగిరిలోకి అడుగుపెట్టడంతో యూజర్లను అట్రాక్ట్ చేయాలని తెగ ప్రయత్నిస్తోంది. దీంతో ఆఫర్లు ప్రకటించాలని నిర్ణయించుకుంది. యూజర్లు వాట్సాప్ పేమెంట్స్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే క్యాష్ బ్యాక్ ఇచ్చేలా రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ వినియోగదారులకు ఈ ఆప్షన్ అందుబాటులోకి వచ్చిందని తెలుస్తోంది
గీవ్ క్యాష్.. గెట్ రూ.51 పేరుతో ఈ ఆఫర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. రూ.1 పంపితే రూ.51 క్యాష్ బ్యాక్‌ను లింకు చేసిన బ్యాంక్ అకౌంట్‌ను పంపుతోంది. ఇలా ప్రతి యూజర్‌కు ఐదు లావాదేవీల వరకు క్యాష్ బ్యాక్ రానుంది. అంటే వాట్సాప్ ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ ద్వారా ఐదు సార్లు రూ.1 చొప్పున రూ.5 పంపితే రూ.51 చొప్పున రూ.255 వరకు క్యాష్ బ్యాక్ వస్తుందన్నమాట. త్వరలోనే ఆండ్రాయిడ్, ఆపిల్ యూజర్లకు వాట్సాప్ ప్రవేశపెట్టిన ఆఫర్ అందుబాటులోకి రానుంది. వాట్సాప్ యాప్‌లో చాట్ బార్ కుడిపక్కన పేమెంట్స్ అనే కేటగిరి కనిపిస్తుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను లింక్ చేయాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం గూగుల్ పే క్యాష్ బ్యాక్ ఇవ్వడం బాగా తగ్గించేసింది. క్యాష్ బ్యాక్ స్థానంలో డిస్కౌంట్ కూపన్లు ఇస్తోంది. వాటి ద్వారా ఏదైనా కొనుగోలు చేస్తే డిస్కౌంట్ లభిస్తుంది