ఉద్యోగుల వ్యక్తిగత అకౌంట్ల నుండి విత్ డ్రా .. రూ.200 కోట్లకుపైనే మాయం

• ఉద్యోగుల వ్యక్తిగత అకౌంట్ల నుండి విత్ డ్రా 

• రూ.200 కోట్లకుపైనే మాయం  

• లేఖ రాయనున్న AG  కార్యాలయం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: ఉద్యోగులకు జమవుతున్న పిఎఫ్. కరువుభత్యం నిధులను ప్రభుత్వం నేరుగా వెనక్కు తీసేసుకుంటోందని ఉద్యోగులు చెబుతున్నారు. ఖాతాల్లో జమచేసినట్లు చేసి మరలా డ్రా చేసేస్తోందంటున్నారు. దీనికి సంబంధించి ఎజి కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిసింది. ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఉద్యోగుల ఖాతాల్లో నుండి వారి అనుమతి లేకుండా నిధులు తీసుకోవడం క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. నిధులు విల్ చేయడంపై ఒకరిద్దరు ఉద్యోగులు ఎజి ఆఫీసును సంప్రదించగా డ్రా అయినట్లు రికార్డుందని, జమచేసిన ఖాతాకే వెళ్లిపోయాయని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరతామని చెప్పినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జిపిఎఫ్ ప్రతినెలా కొంత మొత్తం జమవుతుంటుంది. దీన్ని రిటైర్మెంట్ పూర్తయిన తరువాత అవసరాల కోసం వాడుకుంటూ ఉంటారు. అలాగే కరువుభత్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత జమచేస్తుంది. దీనికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్, అక్టోబరు నెలల్లో ఇలాగే జమచేసింది. దీనిలో నుండి కొంత మొత్తం వెంటనే వెనక్కు వెళ్లిపోయింది మల్లేశ్వరరావు అనే ఉద్యోగి ఖాతా నుండి మార్చి 2021లో రూ.15,934 విత్ డ్రా చేశారు రమేష్ కుమార్ అనే ఉద్యోగి ఖాతా నుండి 30,527 వెనక్కు తీసుకున్నారు. 

CFMS విధానంలో వీరి ఖాతాల్లో డబ్బులు జమవుతుంటాయి. దీనిపై ఆయన ఎజి కార్యాలయాన్ని సంప్రదించగా డబ్బులు ప్రభుత్వ ఏకౌంట్లలోకి జమైనట్లు ఉందని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఒక ఉదో అనుమతి లేకుండా డబ్బులు తీసుకోవడం నేరంగా పరిగణిస్తారు. దీనిపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షలమంది ఈ తరహా పిఎస్ సదుపాయం కలిగి ఉంది. వీరిలో రెండు లక్షల మంది సిపిఎస్ స్కీములోకి వెళ్లిపోయారు. మరో రెండు లక్షల మంది పాత పద్ధతిలో జిపిఎస్ సదుపాయం కలిగి ఉన్నారు. ప్రస్తుతం వీరి ఖాతాల నుండే డబ్బులు విత్ డ్రా అయ్యాయి. ఒక్కొక్కరికి రూ.12 వేల నుండి రూ.30 వేల వరకూ వెనక్కు వెళ్లిపోయాయి. 

సరాసరిన ప్రతిఒక్కరి నుండి రూ.10 వేల చొప్పున వెనక్కు వెళ్లిపోయాయి. సరాసరిన ప్రతిఒక్కరి నుండి రూ.10 వేల చొప్పున వెనక్కు తీసుకున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. అంటే రెండు లక్షల మంది నుండి రూ.200 కోట్లు విత్ డ్రా చేశారు. ఇలా ఈ ఏడాదిలో రెండుసార్లు విత్ డ్రా చేసుకున్నారు. దీనిపై శుక్రవారం జరిగిన జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశంలో ఆర్ధికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఉద్యోగులు అడగ్గా అలా డ్రా చేయడం క్రిమినల్ నేరంగా పరిగణిస్తామని చెప్పారని ఉద్యోగులు తెలిపారు. విచారించి వారంలో ఏమి జరిగిందనేది చెబుతామని తెలిపారు. ఉద్యోగుల ఖాతాల్లో నుండి డబ్బులు డ్రా చేయడం నేరమని, ప్రభుత్వం దీనిపై స్పందించకపోతే వారం తరువాత ప్రభుత్వ ఉద్యోగులు వారు నివాసం ఉండే పోలీసుస్టేషన్ల పరిధిలో ఫిర్యాదులు చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు సూర్యనారాయణ తెలిపారు. ఇలా ఎందుకు జరిగిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని కోరారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad