Apple యాపిల్ సంస్థ ఉద్యోగుల సగటు వేతనం ఎంతో తెలిస్తే షాకవుతారు!

➤ అత్యధికంగా ఓ ఇంజినీర్‌కు రూ.2.6 కోట్లు వేతనం.

➤ కిందిస్థాయి ఉద్యోగి సగటు వేతనం రూ.80 లక్షలు.

➤ వేతనాలపై బిజినెస్ ఇన్‌సైడర్ సంస్థ నివేదిక.

ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలు తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు భారీ వేతనాలు చెల్లించి, వారి ఆకాంక్షలను నేరవేర్చుతుంటాయి. యాపిల్ (Apple), గూగుల్ (Google), మైక్రోసాఫ్ట్ (Microsoft), అమెజాన్ (Amazon)వంటి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులకు ఎంత చెల్లిస్తారనే దానిపై ఉత్సుకత ఉండటం సహజం. ఈ నేపథ్యంలో యాపిల్‌లో పనిచేసే ఇంజనీర్లు, డెవలపర్లకు వేతనం ఏ స్థాయిలో ఉంటుందోనని తెలుసుకుని అమెరికాకు చెందిన బిజినెస్ ఇన్‌సైడర్ నివేదికను వెల్లడించింది.

ఈ నివేదికలో ఆ సంస్థలోని ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగులకు అందుతున్న సగటు వేతనం వివరాలను తెలియజేసింది. యూఎస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ ఫారిన్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌కు యాపిల్‌ కంపెనీ తెలియజేసిన వేతన వివరాలు ఆధారంగా ఈ సమాచారాన్ని సేకరించింది. కాలిఫోర్నియాలోని ఒక ఇంజనీర్‌ అత్యధిక వేతనం నెట్ 3,50,000 డాలర్లు (సుమారు రూ. 2.6 కోట్లు) తీసుకున్నట్లు నివేదిక పేర్కొంది. అత్యల్ప సగటు జీతం 1,06,500 డాలర్లు (దాదాపు రూ. 79.6 లక్షలు) ఉన్నట్టు తెలిపింది.

అమెరికా కంపెనీలు వీసాల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు విదేశాల నుంచి వచ్చే కార్మికులకు ఎంత జీతం ఇవ్వాలనుకుంటున్నారో వెల్లడించాలని నివేదిక పేర్కొంది. సుమారు 1,000 యాపిల్ వర్క్ వీసాలపై మూడో త్రైమాసికంలో వెల్లడించిన డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది. ఈ వేతనాలు అమెరికాకు సంబంధించినవి మాత్రమే.

సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కి 1,28,200- 2,20,000 డాలర్లు (సుమారు రూ.95 లక్షల నుంచి రూ.1.63 కోట్లు), 

సాఫ్ట్‌వేర్‌ డెవలెప్‌మెంట్‌ ఇంజినీర్లు 2,39,871 డాలర్లు (సుమారు రూ.1.78 కోట్లు), 

మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్లు 2,50,000 డాలర్లు (సుమారు రూ.1.86 కోట్లు), 

టెస్టింగ్‌ డెవలెప్‌మెంట్‌ ఇంజినీర్‌ 137,275 డాలర్లు (సుమారు రూ.1.02 కోట్లు), 

ప్రొడక్షన్‌ సర్వీస్‌ ఇంజినీర్‌ 1,50,000 డాలర్లు (సుమారు రూ.1.11 కోట్లు), 

సాఫ్ట్‌వేర్‌ డెవలెప్‌మెంట్‌ ఇంజినీర్‌ 1,25,000 డాలర్లు (సుమారు రూ.93లక్షలు), 

మెషిన్‌ లెర్నింగ్‌ రీసెర్చ్‌ ఇంజినీర్‌ 2,11,300 డాలర్లు (సుమారు రూ. 1.57 కోట్లు)

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad