యాప్లతో యాతన .... రద్దుకోసం ఉద్యమిస్తాం

➤  యాప్లతో యాతన

 ➤ రద్దుకోసం ఉద్యమిస్తాం: ఎన్టీయూ

అమరావతి, ఆంధ్రప్రభ:ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తున్న యాప్లనురద్దు చేయాలని, లేకపోతే బహిష్కరిస్తామని ఎసీయూ రాష్ట్ర మధ్యంతర కౌన్సిల్ సమావేశం తీర్మానించింది. విజయవాడ ఐఎంఏ హాలులో ఆదివారం ఎసీయూ ఏపీ రాష్ట్ర మధ్యంతర కౌన్సిల్ సమా వేశం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు అధ్యక్షతన జరిగింది. టాయిలెట్ల శుభ్రత, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, చిక్కీలు, గుడ్లు, కందిపప్పు, ఫొటోలు, విద్యాకానుక తదితర వివరాలను యాప్లలో అప్లోడ్ చేయ డానికి ఉపాధ్యాయులు నిరంతరం కుస్తీ పడాల్సి వస్తోందన్నారు. చిక్కీలు, గుడ్లు విద్యార్థులకు అందజేయలేదని, యాప్ సంబంధిత సమాచారం అప్లోడ్ చేయలేదని ప లు జిల్లాలలో ఉపాధ్యాయులకు విద్యాశాఖాధికారులు షోకాజ్ నోటీసులిస్తున్నారన్నారు.

వాస్తవంగా చిక్కీలు, గుడ్లను కాంట్రాక్టర్లు పాఠశాల లకు సరఫరా చేయపోవడం వల్ల ఉపాధ్యాయులు విద్యార్థులకు అందజేయలేదన్నారు. సకాలంలో సరఫరా చేయని కాంట్రాక్టర్లకు నోటీసులివ్వ కుండా ఉపాధ్యా యులకు షోకాజ్ నోటీసులివ్వడమేమిటని ప్రశ్నించారు. ఈ విధంగా ఒత్తిడి చేస్తే యాప్లను బహిష రిస్తామని హెచ్చరించారు. 8 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు సకాలంలో పీ ఆర్పీ, డీఏలు అన్న ప్రభుత్వం హామీని నిలబెట్టు కోకపోతే సమ్మెకైనా సిద్ధమన్నారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు అన్న హామీని నెరవేర్చకుండా కమిటీలతో కాలయాపన చేస్తున్నారన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కత్తి నరసిం హారెడ్డి మాట్లాడుతూ నూతన విద్యా విధానం పేరుతో ప్రాథమిక పాఠశాలలను విడిదీయడం తగదని చెప్పినా నిర్ణయంలో మార్పు. రావడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదని, మెగా డీఎస్సీ ప్రకటిస్తామన్న హామీని నిలబెట్టు కోలేదని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాధరెడ్డి మాట్లాడుతూ. సీఎఫ్ఎఎస్ విధానం వల్ల ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారన్నారు. పదవీ విరమణ మరసటి రోజునే చెల్లించవలసిన గ్రాట్యూటీ, కమ్యూటేషన్, పీఎస్ తదితర సౌలభ్యాలు నెలలు గడుస్తున్నా అందడం లేదన్నారు. ఒకటో తేదికి జీతాలు, పెనర్లు అందుకోవడం కలగా నూరిందన్నారు. ఆ అమలు డీఏ సీపీఎస్ యాప్స్ రద్దు వంటి ప్రధాన కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు, 19న చలో అసెంబ్లీ కార్యక్రమాలను చేపట్టను న్నట్లు మధ్యంతర కౌన్సిల్ తీర్మానించామన్నారు. సమా వేశంలో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పి. సుబ్బరాజు, ఉపాధ్యా యవాణి సంపాదకులు ఎస్.శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు ఎల్.సాయిశ్రీనివాస్, ఎం.వి.రమణప్ప, కె.ఎస్.సన్యాసి రావు, హెచ్.తిమ్మన్న, వైసుబ్రహ్మణ్యం రాజు, బి.వెంగళరెడ్డి, వై.రవీంద్రనాధరెడ్డి, గంటా మోహన్ 13 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad