Google Pay వాడుతున్నారా? మరి ఫోన్ పోతే?
ఫోన్ పోయినప్పుడు తమ సమాచారం గురించి దిగులు చెందేవారికిది మంచి సదుపాయమనే చెప్పుకోవాలి. ముందుగా android.com/find వెబ్‌సైట్‌ను తెరవాలి. గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వాలి. అప్పుడు ఎడమ వైపున గూగుల్ అకౌంట్‌తో అనుసంధానమైన పరికరాల వివరాలు కనిపిస్తాయి. ఇందులో ఎరేజ్ డేటా ఫీచర్‌ను ఎంచుకుంటే ఫోన్‌లో ఉన్న డేటా అంతా తొలగిపోతుంది. ఇది వద్దనుకుంటే కస్టమర్ కేర్ ద్వారానూ గూగుల్ ఖాతాను బ్లాక్ చేసుకోవచ్చు. ముందుగా 18004190157 నంబరుకు ఫోన్ చేసి ‘అదర్ ఇష్యూస్’ను ఎంచుకోవాలి. తర్వాత స్పెషలిస్టుతో మాట్లాడే ఆప్షన్‌ను ఎంచుకొని, వారి సాయంతో గూగుల్ ఖాతాను బ్లాక్ చేసుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ ఖాతాతో ముడిపడిన మొబైల్ నంబరును ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.