Indian Coastal Cities: ఈ నగరాలు మరికొన్నేళ్లలో మునిగిపోతాయట!

 Coastal Cities: ఈ నగరాలు మరికొన్నేళ్లలో మునిగిపోతాయట!

houstan

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతంతో పోలిస్తే వాతావరణంలో మార్పులు గణనీయంగా చోటు చేసుకుంటున్నాయి . అందుకే అకాల వర్షాలు, వరదలు.. ప్రకృతి వైపరీత్యాలు. ఈ క్రమంలో సముద్రమట్టం కూడా రోజురోజుకు పెరుగుతోంది. దీంతో సముద్రతీర ప్రాంతాలకు పెను ముప్పు వాటిల్లుతోంది. ఇటీవల ఐక్యరాజ్యసమితి వెలువరించిన ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్ క్లైమేట్‌ ఛేంజ్‌ (ఐపీసీసీ) నివేదికలో నమ్మలేని విషయాలు బయటపడ్డాయి. సముద్రమట్టం పెరగడం వల్ల భారత్‌లోని 12 తీర ప్రాంతాలు సముద్రంలో మునిగిపోయే ప్రమాదముందని తేలింది. ఆ ప్రాంతాలేవంటే..

ఐపీసీసీ నివేదిక ప్రకారం.. ప్రస్తుత వాతావరణ మార్పులు, సముద్రమట్టం పెరుగుదల ఇలాగే కొనసాగితే.. ఈ శతాబ్దం చివరి నాటికి 

దేశ వాణిజ్య రాజధాని ముంబయి (మహారాష్ట్ర) 1.90 అడుగుల మేర సముద్రంలో మునిగిపోతుందట. 

చెన్నై(తమిళనాడు) 1.87 అడుగులు, 

భావ్‌నగర్‌ (గుజరాత్‌) 2.70 అడుగులు, 

మంగళూరు (కర్ణాటక) 1.87 అడుగులు, 

మార్మ్‌గావ్‌ (గోవా) 2.06 అడుగులు, 

ట్యూటికోరిన్‌ (తమిళనాడు) 1.90 అడుగులు, 

కిదిర్‌పూర్‌ (పశ్చిమ బెంగాల్‌) 0.49 అడుగులు, 

పారాదీప్‌ (ఒడిశా) 1.93 అడుగులు, 

ఒకా (గుజరాత్‌) 1.96 అడుగులు, 

విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్‌) 1.77 అడుగులు, 

కాండ్లా (గుజరాత్‌) 1.87 అడుగులు మేర సముద్రంలో మునిగిపోతాయని అంచనా. అందుకే ఇప్పటికైనా పర్యావరణాన్ని రక్షించుకోవాలని ఐపీసీసీ సూచిస్తోంది.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad