JAC EC లో ఉద్యోగుల సమస్యల సాధన కై కార్యాచరణ రూపొందించారు

 అమరావతి: ఏపీలో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. త్వరలో ఏపీ జేఏసీ అమరావతి, ఎన్జీవో జేఏసీ ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ వెల్లడించనున్నాయి. ఉద్యమం తప్పదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. . ఏపీలో కొంత కాలంగా పీఆర్సీతో పాటుగా పెండింగ్ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అక్టోబర్ నెలాఖరు నాటికే పీఆర్సీపై స్పష్టత ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. 


AP JAC అమరావతి రాష్ట్ర కార్యవర్గ తీర్మానాలు :

1) AP JAC మరియు AP JAC అమరావతి ఐక్యవేదికగా ఏర్పడిన తరువాత 11వ PRC మరియు ఆర్ధిక ఆర్ధికేతర సమస్యల పరిష్కారానికి చేసిన ప్రతి ప్రయత్నాన్ని ఈ సమావేసము ఏకగ్రీవముగా ఆమోదిస్తూ తీర్మానించుటమైనది.

2) AP JAC మరియు AP JAC అమరావతి ఐక్యవేదికగా తరపున ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారము కొరకు ప్రభుత్వ పెద్దలను ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి దఫ దఫాలుగా తెలియజేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా తీవ్ర నిరాశకు గురి చేసి, ప్రత్యక్షముగా ప్రభుత్వమే ఉద్యోగ, ఉపాధ్యాయులను ఆందోళనబాటను గురిచేసినట్లు AP JAC అమరావతిలోని భాగస్వామ్య సంఘాలన్నీ భావిస్తూ, ఉద్యమ కార్యాచరణకు ప్రభుత్వమే పూర్తిగా భాద్యత వహించాలని ఏకగ్రీవముగా తీర్మానము చేయడమైనది.

3) 28.11.2021 న NGO హోం నందు జరుగు సంయుక్త సమావేశములో ఇరు JAC ల ఐక్య వేదిక తీసుకునే ఉద్యమ కార్యాచరణను AP JAC అమరావతిలోని భాగస్వామ్య డిపార్టుమెంటు సంఘాల ఉద్యోగులు అందరు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదము చేయవలెనని ఏకగ్రీవముగా తీర్మనించుటమైనది

4) గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులలో వున్న తీవ్రమైన వ్యతిరేకతను అర్ధం చేసుకొని వెంటనే జోక్యం చేసుకోవడం ద్వారా 11వ PRC నివేదికను బహిర్గతము చేసి తక్షణమే ఆమోదం తెలపాలని, సుధీర్గ కాలముగా పెండింగులో ఉన్న ఉద్యోగుల ఆర్ధిక, ఆర్ధికేతర అంశాలు తక్షణమే పరిష్కరించాలని వాటితో పాటు CPS రద్దు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పొరుగుసేవల ఉద్యోగుల జీతభత్యాల పెంపు పై వెంటనే చర్యలు తీసుకోవాలని, EHS కార్డ్ లతో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులపై ఉన్నతాధికారులతో వెంటనే సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని AP JAC అమరావతి రాష్ట్ర కార్యవర్గము ఏకగ్రీవముగా తీర్మానించడమైనది.

ఈ సమావేశములో AP JAC అమరావతి సెక్రటరీ జనరల్ వై.వి. రావు, అసోసియేట్ చైర్మన్ పణి పేర్రాజు, కోశాధికారి వి.వి.మురళికృష్ణ నాయుడు మరియు ఇతర రాష్ట్ర కార్యవర్గము, జిల్లా చైర్మన్, కార్యదర్శులు, సభ్య సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.


ఈరోజు JAC EC లో ఉద్యోగుల సమస్యల సాధన కై కార్యాచరణ రూపొందించారు:

1) 1.12.2021 ఛీఫ్ సెక్రెటరీ గారికి నోటీస్ ఇవ్వడం

2) 7.12.21 to 10.12.21 బ్లాక్ బ్యాడ్జిస్ పెట్టుకొని నిరసన తెలియచేయడం, లంచ్ అవర్ డెమోనిస్ట్రేషన్

3) 13.12.21 న అన్ని తాలూకా కేంద్రాలలో నిరసన ర్యాలీ

4) 16.12.21 న అన్ని తాలూకా కేంద్రాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు

5) 21.12.21 న అన్ని జిల్లా కేంద్రాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు

6) 27.12.21 విశాఖపట్నం లో సాయంత్రం 4 గంటలకు ప్రాంతీయ సదస్సు

7) 30.12.21 తిరుపతి లో సాయంత్రం 4 గంటలకు ప్రాంతీయ సదస్సు

8) 03.01.22 ఏలూరు లో సాయంత్రం 4 గంటలకు ప్రాంతీయ సదస్సు

9) 06.01.22 ఒంగోలు లో సాయంత్రం 4 గంటలకు ప్రాంతీయ సదస్సు```

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad