♣ అడగాల్సింది నివేదిక కాదు PRC యే
♣ సమావేశం బహిష్కరణ ను ఆహ్వానిస్తున్నా
♣ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ
నవంబరు 12 - ఉద్యోగ సంఘాలు అడగాల్సింది పీఆర్సీ నివేదిక కాదని, పీఆర్సీ అమలు చేయాలంటూ కోరాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ అన్నారు. ప్రభుత్వం నిర్వహించిన సమావేశాన్ని ఉద్యోగ సంఘాలు కొన్ని బహిష్కరించడాన్ని ఒక ఉద్యోగిగా స్వాగతిస్తున్నా అని ఆయన అన్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించిన తర్వాత విభేదించి సమావేశం బహిష్కరించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. వెలగపూడి సచివాలయం లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
♣ సచివాలయంలో ఇవాళ ప్రభుత్వం నిర్వహించింది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కాదు.
♣ పీఆర్సీపై ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవాలి.
♣ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి సొమ్ము విత్ డ్రా చేసిన అంశంపై విచారణ చేయాలని కోరాము. అధికారులు ఇందుకు అంగీకరించారు.
♣ ఈ వ్యవహారంలో ప్రభుత్వం స్పందించకపోతే ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి, సీఎఫ్ఎంఎస్ సీఈఓలపై క్రిమినల్ కేసులు పెడతాం
♣ ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎఫ్ ఖాతాల నుంచి నిధులు విత్ డ్రా చేయటం నేరం . ఇలా జరిగిందని అకౌంటెంట్ జనరల్ కార్యాలయం ధ్రువీకరించింది.
పిఆర్సి నివేదిక విడుదల కు నో
- సమావేశం బహిష్కరించిన ఉద్యోగ సంఘాలు
- ఎన్జీవో జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు బయటకు.
నవంబర్ 12 - పీఆర్సీ నివేదిక విడుదలకు ప్రభుత్వం ససేమిరా అంది. వెలగపూడి సచివాలయం లో శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో కూడా పిఆర్సి నివేదిక బయట పెట్టేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేయలేదు. పీఆర్సీ నివేదిక ఇవ్వకపోతే సమావేశాన్ని బహిష్కరిస్తామని ఏపీఎన్జీవో జేఏసీ నేతలు, అమరావతి జేఏసీ నేతలు అధికారు లకు తెలియజేశారు. నివేదిక విడుదలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు తెలియజేయడంతో ఈ రెండు సంఘాల నేతలు సమావేశాన్ని బహిష్కరించారు. సమావేశం నుంచి బయటకు వచ్చేశారు