అసెంబ్లీ అవగానే PRC

 *పీఆర్సీపై దిగులొద్దు..

*అసెంబ్లీ కాగానే వేగంగా ప్రక్రియ..

*వారం పది రోజుల్లో పూర్తి..

 *ప్రొబేషన్ డిక్లరేషన్ పైనా చర్యలు..

*సీఎంఓ అధికారులకు సీఎం ఆదేశం..

అమరావతి, ఆంధ్రప్రభ:

పీఆర్సీ అమలుపై ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ సచివాల య సంఘం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లా యిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. గురువారం రెండు సంఘాల తరుపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి పీఆర్సీ అమలు గురించి ఉద్యోగు ల ఆందోళనను తెలియజేశారు. పీఆర్సీ అమలు ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని, ఇంకా ఆలస్యం అవుతున్న కొద్దీ ఉద్యోగు ల్లో అసంతృప్తి పెరుగుతుందని, వీలైనంత త్వరగా పీఆర్సీని అమలు చేయాలని ముఖ్య మంత్రికి విజ్ఞప్తి చేశారు. విజ్ఞప్తిపై స్పందించిన ముఖ్యమంత్రి పీఆర్సీని వెంటనే ఇచ్చేస్తామని చెప్పారన్నారు.

🍏అసెంబ్లీ సమావేశాలు పూర్తవగానే పీఆర్సీపై దృష్టి పెట్టి మొత్తం ప్రక్రియను వారం పది | రోజులలో పూర్తి చేయాలని సీఎంవో అధికారు లను ఆదేశించారని తెలిపారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్పై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్ప టికీ.. అమలులో తీవ్ర జాప్యం జరుగుతోం దని, త్వరగా ప్రొబేషన్ డిక్లేర్ చేసేలా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరామని వివరించారు. దీన్ని త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులను ఆదేశించారని వెంకట్రామిరెడ్డి తెలిపారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad