AP లో ” 5 % ” రూల్..! ఇక అందరికీ వర్తింపు ?


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసింది. జీవోలన్నీ రహస్యంగా ఉంచుతోంది కాబట్టి ఇలాంటి చిత్రవిచిత్రాలు ఎన్ని ఉంటున్నాయో కానీ కొన్ని బయటకురాక తప్పదు. అలా వచ్చిన కొత్త జీవో ప్రకారం.. ఇక నుంచి ఏపీలో ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నా ఐదు శాతం జగనన్న కాలనీలకు చందా ఇచ్చుకోవాల్సిందే. అది స్థలం రూపంలో అయినా కావొచ్చు.. డబ్బు రూపంలో అయినా కావొచ్చు. అది ఇచ్చే వాళ్ల ఇష్టం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేసే ప్రైవేటు వెంచర్లలో ఐదు శాతం జగనన్న కాలనీలకు ఇవ్వాలనేది ప్రభుత్వ తాజా నిర్ణయం. అయితే ఆ వెంచర్లలోనే ఇవ్వాలనేం లేదు. కాస్త దూరంగా అయినా ఇవ్వొచ్చు… లేదా డబ్బులు కూడా కట్టొచ్చు. ఈ నిర్ణయం చూసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా నిర్వేదానికి గురయ్యే పరిస్థితి వచ్చింది. Also Read
Digital Panchayat - Housetax 5% Enhancement Process

రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలంటే రోడ్లకు.. ఇతర అవసరాలకు స్థలం వదిలేయడమే కాకుండా.. పది శాతం సామాజిక అవసరాలకు ఆ వెంచర్‌కు వదిలి పెట్టారు. ఇప్పుడు అదనంగా మరో ఐదు శాతం అంటే.. ఇక ఎకరం స్థలంలో వెంచర్ వేస్తే అర ఎకరం కూడా అమ్ముకోవడానికి ఉండదు. అయితే ఇలా ప్రైవేటు వ్యక్తుల వ్యాపారాల్లో ప్రభుత్వ పథకానికి కొంత ఇవ్వాలని ఉత్తర్వులు ఇవ్వడం ఏ చట్టం ప్రకారం న్యాయబద్ధమో ఎవరికీ తెలియడం లేదు. తమకు అధికారం ఉంది కాబట్టి ఉత్తర్వులు ఇస్తాం.. ఇచ్చిన ప్రకారం చెల్లింపులు చేయాలన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

ముందు ముందు ప్రజల సంపాదనలో ప్రభుత్వ పథకాలకు కొంత మొత్తం ఇవ్వాలన్న నిబంధనలు కూడా తెచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్న వాదన వినిపిస్తోంది. ఓటు బ్యాంక్‌కు పథకాలు అమలు చేయడానికి నిధులు సమకూర్చడం కోసం ఇలా ఇతర వర్గాల మీద దాడి జరుగుతోందన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం అంటే పరిపాలన చేయాలి. అంతే కానీ.. ప్రతి అడుగులోనూ ప్రజల జీవితాల్ని ప్రభావితం చేయాలనుకోవడం.. చేస్తామని పట్టుదలకు పోవడం వింతే. ఇలాంటి వింత పోకడలకు ఏపీ ప్రభుత్వం పోతోంది. చట్టాలను.. రాజ్యాంగాలను కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటోంది.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad