AP PRC NEWS : మరికాసేపట్లో సీఎం ప్రకటించే ఛాన్స్!

AP Govt.On PRC: ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొలిక్కి వచ్చిన పీఆర్సీ.. మరికాసేపట్లో సీఎం ప్రకటించే ఛాన్స్!


AP CM Jagan on PRC: ఆంధ్రప్రదేశ్‌లో PRC ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న పీఆర్సీపై ప్రభుత్వం ఓ ప్రకటన చేయనుంది. దీనిపై పది రోజుల్లో ప్రకటన చేయనున్నామని స్వయంగా సీఎం జగన్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. ఇప్పటికే పీఆర్సీ ఎంతివ్వాలనే దానిపై కమిటీ ఓ నివేదిక తయారు చేసింది. మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు PRC కమిటీ తుది నివేదిక ఇవ్వనుంది. అనంతరం సీఎం జగన్ పీఆర్సీపై కీలక ప్రకటన చేయనున్నారు.


తెలుసుకోండిPRC 2020 (PRC 2018) New Basic Pay Calculator

పీఆర్సీ కమిటీ నివేదికను పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి ఫిట్‌మెంట్‌ ఖరారు చేయనున్నారు. సీఎం జగన్ నిర్ణయం తర్వాత ఉద్యోగ సంఘాలకు.. సమాచారం అందించనున్నారు. అనంతరం సాయంత్రం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పీఆర్సీ అమలు కోసం ఉద్యోగులు గత కొద్దిరోజులుగా ఆందోళనబాట పట్టారు. ఈనెల ఏడు నుంచి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే పరిష్కరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

ఇప్పుడే ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణ రెడ్డి గారి నుండి నాకు కాల్ వచ్చింది. ముఖ్యమంత్రి గారి వద్ద PRC అంశంపై అధికారుల సమావేశం జరిగింది. కార్యదర్శుల కమిటీ నివేదిక ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సిఎం కి ఇస్తారు, అదే నివేదిక సాయంత్రం 6 గంటలకు సంఘాలకు CS గారు ఇస్తారు. రేపు సిఎం గారి వద్ద సంఘాల నాయకులు తో సమావేశంలో అంతిమ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

సమాచారం నిమిత్తం తెలియ చేస్తున్నాను.

ఇట్లు 

రామ సూర్యనారాయణ

 అధ్యక్షులు 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

పీఆర్సీ విషయంలో ఏదో ఒకటి తేల్చాలని చెబుతున్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడం వల్లే తాము ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించాయి. ఈ క్రమంలో..ఏపీలో సృష్టించిన వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. చిత్తూరు జిల్లాకు వచ్చిన సీఎం జగన్ ను ఉద్యోగ సంఘాలు కలిశాయి. పీఆర్సీ విషయాన్ని ప్రస్తావించాయి. దీంతో పది రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేయడం జరుగుతుందనే విషయాన్ని ఆయన వారికి చెప్పారు. ఈ నేపథ్యంలోనే పీఆర్సీ ఎంత ప్రకటిస్తారనే ఉత్కంఠ ఉద్యోగుల్లో నెలకొంది. సీఎం నిర్ణయం తీసుకున్న అనంతరం ఉద్యోగ సంఘాలకు అధికారలు సమాచారం ఇవ్వనున్నారు. సాయంత్రం పీఆర్సీపై అధికారికంగా ప్రకటన చేయనున్నారు సీఎం జగన్.

ఇదిలావుంటే. తాజాగా పీఆర్సీ విషయంలో ఉద్యోగ సంఘాల మధ్య ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. 2018 జులై 01వ తేదీ నుంచి పీఆర్సీ సిఫార్సులను అమలు చేయాలని, 55 పర్సంటేజీ ఫిట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరి సీఎం జగన్ ఎలాంటి ప్రకటన చేస్తారనే ఉత్కంఠ నెలకొంది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad