గ్రామ సచివాలయాల్లో ATM లు.. CM JAGAN కీలక ఆదేశాలు..

  గ్రామ సచివాలయాల్లో ఏటీఎంలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజల ఇళ్ల వద్దకే తీసుకెళ్తోంది. గ్రామ సచివాలయాల ద్వారానే కీలక పౌరసేవలను అందిస్తోంది. ఇటీవలే జగనన్న శాశ్వత గృహహక్కు పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లను కూడా గ్రామ సచివాలయాల్లోనే చేపడుతోంది. అలాగే గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు మరిన్ని సేవలను గ్రామ సచివాలయాల ద్వారా అందించేందుకు సీఎం జగన్ (AP CM YS Jagan) రంగం సిద్ధం చేశారు. మంగళవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో సమావేశమైన సీఎం.. పలు కీలక అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ సేవల అందించే అంశాలను పరిశీలించాలని సీఎం జగన్.. బ్యాంకింగ్ సంస్థలకు సూచించారు.

గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లో ఏటీఎంలు పెట్టేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని జగన్ అన్నారు. గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయన్న సీఎం.. ఇప్పటికే జగనన్న పాలవెల్లువ కార్యక్రమం చురుగ్గా సాగుతోందని.. దీంతో పాటు రానున్న రోజుల్లో గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ పనులు జరుగుతాయని తెలిపారు. సచివాలయాల్లో ఏటీఎంల ఏర్పాటు ద్వారా లావాదేవీల ప్రక్రియ కూడా జరుగుతుందని.., ఈ నేపథ్యలో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌సేవలు విస్తృతం కావాలన్నారు.

ఏటీఎం సహా ఇతర ఆర్థిక కార్యకలాపాలకు వేదికగా మారాలన్న జగన్.. దీనివల్ల బ్యాంకింగ్‌ సేవలు వారి గ్రామంలోనే ప్రజలకు లభిస్తాయన్నారు. గ్రామీణ వ్యవస్థల్లో ఇదో గొప్పమార్పునకు దారితీస్తుందని చెప్పారు. పైలట్‌ప్రాజెక్ట్‌గా కొన్ని కేంద్రాల్లో ప్రారంభించి.., తర్వాత విస్తరిస్తామని తెలిపిన బ్యాంకర్ల సీఎం జగన్ కు తెలిపారు. ఇప్పటికే కొన్నిజిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించామని వెల్లడించారు

బ్యాంకర్ల సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అవసరాలు ఏమిటి.. ఏం చేస్తే బావుంటుందనే అంశాలపై సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం భారీగా తగ్గిందన్నారు. 2019-20లో రూ.8వేల కోట్లు, 2020-21లో రూ.14వేల కోట్లు తగ్గడంతో పాటు కొవిడ్ నివారణకు అదనంగా రూ.8వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని.. దీంతో మొత్తం రూ.30 వేల కోట్ల భారం పడిందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బ్యాంకింగ్ రంగం సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కిందని సీఎం అభిప్రాయపడ్డారు. బ్యాంకర్ల సహకారం లేకపోతే ఆర్ధిక వనరులను సమకూర్చుకోవడం చాలా కష్టమయ్యేదన్నారు. బ్యాంకుల సహకారం వల్లనే గ్రామీణ ఆర్థిక పరిస్థితి కూడా గాడిలో పడిందని చెప్పారు.

బ్యాంకులు తమ మొత్తం నికర రుణంలో ప్రాధాన్యతా రంగాలకు నిర్దేశించిన దానికి మించి 59.5 శాతం రుణాలు ఇవ్వడం, మరోవైపు రుణాలు–డిపాజిట్ల నిష్పత్తి 136 శాతం ఉండేలా బ్యాంకులు చూపిన చొరవ.. అదే విధంగా కోవిడ్‌ కష్టకాలంలో రాష్ట్రాన్ని ఆదుకున్నందుకు బ్యాంకింగ్ రంగాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక రూ.2,83,380 కోట్లు కాగా, అందులో మొదటి ఆరు నెలల్లోనే 60.53 శాతం, అంటే ఏకంగా రూ.1,71,520 కోట్ల రుణాలు బ్యాంకులు పంపిణీ చేశాయని.. అదే విధంగా ప్రాధాన్యతా రంగాలకు వార్షిక రుణ లక్ష్యం రూ.2,13,560 కోట్లు కాగా, అందులో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 47.29 శాతం, అంటే రూ.1,00,990 కోట్లను బ్యాంకులు ప్రాధాన్యతా రంగ రుణాలు మంజూరు చేసినట్లు సీఎం గుర్తుచేశారు

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad