Big Breaking: ఇండియాలోకి ప్రవేశించిన కరోనా ఒమైక్రాన్.. రెండు కేసులు నమోదు

 


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వైరస్ ఇండియాలోకి ప్రవేశించింది. ఇండియాలో రెండు ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్రం వైద్య,ఆరోగ్యశాఖ ధృవీకరించింది. కర్ణాటకలో రెండు ఒమైక్రాన్ కేసులు నమోదైనట్టు వెల్లడించింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. అందులో ఒకరి వయసు 66 కాగా, మరొకరి వయసు 46 సంవత్సరాలు. వీరి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను ట్రేస్ చేసి టెస్ట్ చేస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటివరకు వారిలో ఎలాంటి తీవ్ర లక్షణాలు లేవని వెల్లడించారు. వారిలో కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

ఒమైక్రాన్ కేసులు వెలుగు చూసిన దేశాల నుంచి ప్రయాణికులు కచ్చితంగా ఎయిర్‌పోర్టులోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వాళ్లంతా కచ్చితంగా కరోనా ప్రోటోకాల్ పాటించాలని చెప్పారు. వారికి కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ.. 7 రోజులు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టం చేశారు. కరోనా కొత్త వేరియంట్‌ను గుర్తించేందుకు కొత్తగా 37 ల్యాబ్‌లను ఏర్పాటు చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కానీ అంతా అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ్ సూచించారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 29 దేశాల్లో 373 ఒమైక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది

ఒమిక్రాన్ వైరస్ వేగంగా విస్తరిస్తోందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 3 రోజుల్లోనే మూడు దేశాల నుంచి 24 దేశాల‌కు విస్త‌రించింద‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లంద‌రూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. డిసెంబ‌ర్ 31వ తేదీలోపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసేందుకు చ‌ర్య‌లు తీసుకంటున్నామ‌ని తెలిపారు. మాస్కు ధ‌రించ‌డం, వ్యాక్సిన్ తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి చేసుకోవాలి. జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే ఇప్పుడు జ‌రుగుతున్న అస‌త్య ప్ర‌చారాలే వాస్త‌వాల‌వుతాయని అన్నారు.

ఏదైతే జరగకూడదని అనుకుంటున్నామో ఏకంగా అదే జరిగింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వైరస్‌ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ ట్రేస్‌ అయినట్లు జీనోమ్ స్వీక్వెనింగ్ పరీక్షలో వెల్లడైంది. కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ఈ బాంబులాంటి వార్త పేల్చారు. ఒమిక్రాన్‌ బారినపడ్డవారిలో ఒకరు 66 ఏళ్ల పురుషుడు, మరొకరు కూడా 46 ఏళ్ల పురుషుడు. ఒమిక్రాన్‌ నిర్ధారణ కావడంతో వీరిద్దరిని క్వారంటైన్‌కు తరలించామని ఆయన చెప్పారు. దీంతో ఈ వేరియెంట్‌ మనదేశంలో మరింత ప్రబలే ప్రమాదం ఉందని.. ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.

ఇదిలా ఉంటే.. కరోనా డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ 5 రెట్లు ఎక్కువ ప్రమాదకరమని.. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందని భయపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)ను ఉటంకిస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. ఈ వైరస్ 29 దేశాలకు విస్తరించిందని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ఆందోళన వైవిధ్యాల విభాగంలో ఉంచింది. గత నెల రోజులుగా దేశంలో కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇప్పుడు మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో 10 వేలకు పైగా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇది దేశంలోని మొత్తం కేసులలో 55 శాతం అని చెప్పుకొచ్చారు. జనాభాలో 49 శాతం మంది రెండు డోస్‌లు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఈ కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad