పాఠశాలల ర్యాంకులకు మదింపు

 పాఠశాలల ర్యాంకులకు మదింపు

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల స్వీయ, బాహ్య మదింపు ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు విద్యాశాఖ ర్యాంకులివ్వనుంది. వీటి ఆధారంగా పాఠశా లలు మండలం, జిల్లా, రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తించేందుకు అవ కాశం ఉంటుంది. పాఠశాల ప్రమాణాలు, మదింపుపై విద్యా ప్రణాళిక, పరిపా లన జాతీయ సంస్థ రూపొందించిన అంశాలను ప్రామాణికంగా తీసుకోను న్నారు. పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే బాహ్య మదింపునకు సంబంధించిన అంశాలను పాఠశాలలకు పంపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 37,729 ప్రాథమిక, 7,073 సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలల్లో ఇది నిర్వహించనున్నారు. పాఠశాలలో సృజనాత్మకత, అత్యుత్తమ విధానాలను గుర్తించేందుకు, పాఠశాల బలాలు, మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలు, పాఠశాల కార్యాచరణ ప్రణాళి కను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దీన్ని తీసుకొస్తున్నారు. పాఠశాల ఆవరణ, ఆట స్థలం, విద్యుత్తు, గాడ్జెట్లు, గ్రంథాలయం, ప్రయోగశాల, తాగునీరు, మరు గుదొడ్లు, చేతులు కడుక్కునే సౌకర్యం, ఉపాధ్యాయుల బోధన పరిజ్ఞానం, బోధన కోసం ప్రణాళిక లాంటి అంశాలకు 1, 2, 3 స్థాయిలను కేటాయిస్తారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad