వివాదాలకు కారణమయ్యే ఉపాధ్యాయులపై చర్యలు .. మంత్రి సురేష్ ..
ఈనాడు, అమరావతి: ఆదర్శ పాఠశాలలు, కస్తూ ర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో అందిస్తున్న భోజనం నాణ్యతలో రాజీపడేది లేదని మంత్రి ఆదిమూలపు సరేష్ వెల్లడించారు. ఆదర్శ పాఠశాలల వసతిగృహాల్లో సదుపాయాలు, సరకుల సరఫరాపై ఫిర్యాదుల నేప థ్యంలో ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారు లతో సమీక్షించారు. 'కొన్నిచోట్ల ఉపాధ్యాయుల మధ్య అంతర్గత విభేదాలతో అసత్య కథనాలు బయటకు వస్తున్నాయి. ఇలాంటి వివాదాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా అమలు చేస్తున్న పథకాలు కొంతమంది అంత ర్గత కలహాల కారణంగా అబాసుపాలు కావడాన్ని సహించేది లేదు.
Also Read: పాఠశాల నిర్వాహకుడి అకృత్యం.. ఆహారంలో మత్తుమందు కలిపి
ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీల పర్యవేక్షణకు త్వరలో అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తాం. ఎక్కడైనా మెనూ అమలు కావడం లేదని ఫిర్యాదు వస్తే సంబంధిత అధికారు లపై చర్యలు తప్పవు. ఇటీవల వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి నివేదిక ఇవ్వండి. భోజనం బిల్లులు రాలే దని చెప్పడం సరే.. వాటిని సకాలంలో పోర్టల్లో ఎందుకు పొందుపర్చలేకపోతున్నారు? అన్ని జిల్లాల్లో రావాల్సిన బకాయిల వివరాలను వెంటనే పోర్టల్లో నమోదు చేయాలి. ప్రకాశం జిల్లా దర్శి, కడప జిల్లా బాజీపేట ఆదర్శ పాఠశాలల నుంచి వచ్చిన ఫిర్యాదు. లపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వండి. ప్రతి జిల్లా అదనపు ప్రాజెక్టు సమన్వయ అధికారి వారంలో నాలుగు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఆదర్శ పాఠశాలల మెనూను పరిశీలించాలి. నీటి ట్యాంకుల పరిశుభ్రత, ఆర్వో ప్లాంట్ల నిర్వహణపై దృష్టి పెట్టాలి" అని మంత్రి ఆదేశించారు.