Huawei: పాకెట్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన హువావే..!

 Huawei: పాకెట్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన హువావే..!

Huawei P50 Pocket comes with gapless folding screen and SD888 chipset

ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం హువావే పాకెట్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసింది. హువావే లాంచ్‌ చేసిన మొదటి క్లామ్‌షెల్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌గా హువావే P50 పాకెట్‌ నిలవనుంది. ఈ ఫోన్‌ సాధారణ ఫ్లిప్‌ ఫోన్‌లాగా ఉండనుంది. హువావే పీ50 పాకెట్‌ తొలుత చైనా మార్కెట్లలో లభించనుంది.

వచ్చే ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా లభించనుంది. క్రిస్టల్ వైట్ , అబ్సిడియన్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం ఎడిషన్‌ను డచ్‌కు చెందిన ప్రముఖ డిజైనర్‌ ఐరిస్‌ వాన్‌ హెర్పెర్‌తో హువావే జతకట్టింది.‍ 8జీబీ ర్యామ్‌ + 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్; ప్రీమియం ఎడిషన్‌ 12జీబీ + 512జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో రానుంది.  హువావే పీ50 పాకెట్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర దాదాపు రూ. 1.06 లక్షల నుంచి ప్రారంభం కానుంది. 

There’s a 6.9-inch 120Hz OLED main screen with a tall 21:9 aspect ratio and 2790 x 1188 px resolution. Huawei went with a punch-hole cutout on the top which houses the selfie camera.

హువావే పీ50 పాకెట్‌ ఫీచర్స్‌..!

  1. 6.9-అంగుళాల ప్రైమరీ OLED డిస్‌ప్లే
  2. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌
  3. హర్మోని ఆపరేటింగ్‌ సిస్టమ్‌
  4. 40ఎంపీ+ 13ఎంపీ + 32ఎంపీ రియర్‌ కెమెరా
  5. 10.7ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
  6. 8జీబీ ర్యామ్‌+ 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  7. 4000mAh బ్యాటరీ కెపాసిటీ
  8. 40W ఫాస్ట్ ఛార్జింగ్‌

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad