PRC పై తేలని పంచాయితీ.. అసంపూర్తిగా ముగిసిన చర్చలు: ఏపీ ఉద్యోగుల SHOCKING ప్రెస్ మీట్

PRC పై తేలని పంచాయితీ.. అసంపూర్తిగా ముగిసిన చర్చలు

☆ పీఆర్సీపై ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశమైంది.

☆ ఆర్థికశాఖ అధికారులు శశిభూషణ్‌ కుమార్‌, సత్యనారాయణల నేతృత్వంలో విడతల వారీగా ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ సహా ఆర్థిక అంశాలపై చర్చించారు.

☆ తొలుత ఏపీ ఎన్జీఓ, ఏపీ రెవెన్యూ తదితర సంఘాలతో అధికారులు సమావేశమై ప్రభుత్వ ప్రతిపాదనలు వారి ముందు ఉంచారు.

☆ ప్రస్తుతం 27 శాతం ఐఆర్ ఇస్తున్నందున కొద్దిమేర పెంచి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారని పేర్కొన్నారు.

☆ కొత్తగా రూపొందించిన ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాలకు వివరించారు.

☆ ఏపీ రెవెన్యూ తదితర సంఘాలతో అధికారులు సమావేశమై ప్రభుత్వ ప్రతిపాదనలు వారి ముందు ఉంచారు.

☆ ప్రస్తుతం 27 శాతం ఐఆర్ ఇస్తున్నందున కొద్దిమేర పెంచి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారని పేర్కొన్నారు.

☆ కొత్తగా రూపొందించిన ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాలకు వివరించారు. 

☆ సమావేశం ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ... అధికారుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

☆ ‘‘వారం పది రోజుల్లో పీఆర్‌సీ ఇస్తామని సీఎం తిరుపతిలో చెప్పారు.

☆ ఇవ్వలేదు. ఆ తర్వాత 72గంటల్లో ప్రకటిస్తామన్నారు... అదీ లేదు.

☆ ఇవాళ సమావేశానికి పిలిచి పీఆర్‌సీ ఎంత ఇస్తారో చెప్పకుండా ఆర్థిక పరమైన అంశాలు వివరిస్తున్నారు. 14.29శాతం ఫిట్‌మెంట్‌ ఆమోదయోగ్యం కాదని చెప్పాం.

☆ చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప... ఫలితం ఉండటంలేదు’’ అని ఏపీ జేఏసీ ఛైర్మన్‌ బండి శ్రీనివాసులు పేర్కొన్నారు.

☆ జనవరి 3న జరిగే జేఏసీ సమావేశంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

☆  ఉద్యోగులను అవమానించడానికి సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప ఉపయోగం లేదని అమరావతి జేఏసీ ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

☆ ‘‘ఈరోజు చెబుతున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి.

☆  రాష్ట్రంలో వచ్చే ఆదాయంలో రూ.75వేల కోట్లు ఉద్యోగుల కోసమే ఖర్చు చేస్తున్నామంటున్నారు.

☆ 2013 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎక్కడా తగ్గలేదు.

☆ ఉద్యోగుల కోసం 32శాతం ఖర్చు పెడుతూ..  రాష్ట్ర బడ్జెట్‌ మొత్తం ఖర్చు చేస్తున్నామని చెప్పడం సత్యదూరం.

☆ చర్చలకు ఎందుకు పిలిచారని అడిగితే .. ఫిట్‌మెంట్‌ గురించి మాట్లాడటానికని చెప్పారు.

☆ ఫిట్‌మెంట్‌ ఎంత ఇస్తారంటే మళ్లీ మొదటికొచ్చారు. 

☆ జీపీఎఫ్‌ సొమ్ము రూ.2,100 కోట్లు పక్కదారి పట్టించారు.

☆ ఇప్పటి వరకు 7 డీఏలు చెల్లించలేదు. డీఏ బకాయిలు రూ.6వేల కోట్లు ఇవ్వాలి.

☆ పీఆర్సీతో పాటు సీపీఎస్‌ రద్దు, ఒప్పంద సిబ్బంది క్రమబద్దీకరణపై  నిర్ణయం వెల్లడించాలి.

☆ ప్రభుత్వ కార్యాచరణ ఇలానే ఉంటే తదుపరి కార్యాచరణకు వెళ్లక తప్పదు.

☆ సీఎం వద్దకు వారం రోజుల్లో తీసుకెళ్తామని ఇప్పటి వరకు పట్టించుకోలేదు.

☆ గతంలోనే ఎక్కువ జీతం తీసుకున్నారు.. దానికి పాటు తగ్గకుండా ఇస్తామని చెబుతున్నారు.

☆ ఇది అన్యాయం’’ అని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వక్తం చేశారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad