ఎస్‌బీఐ ఖాతాదారులకు బంపర్ ఆఫర్..!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ తన ఖాతాదారులకు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఎస్‌బీఐ ఖాతాదారులకు 3-ఇన్-1 ఖాతా పేరుతో సరికొత్త సేవలను ప్రారంభించింది. ఎస్‌బీఐ ఖాతాదారులకు సేవింగ్స్ ఖాతా, డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాలను అనుసంధానించే 3-ఇన్-1 ఖాతా సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ఖాతా వల్ల ట్రేడింగ్ చేసే వారి ప్రయోజనం చేకూరుతుంది. వినియోగదారులు ఒకే ఖాతాతో మూడు రకాల సదుపాయాలను పొందుతారు. ఈ విషయన్ని ఎస్‌బీఐ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలియజేసింది. మీరు ఎస్‌బీఐ 3-ఇన్-1 తెరవాలనుకుంటే ఈ క్రింది పేర్కొన్న పత్రాలు అవసరం.
ఎస్‌బీఐ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కోసం:
పాన్ కార్డు లేదా ఫారం 60
ఫోటోగ్రాఫ్
పాస్‌పోర్ట్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డ్, ఎమ్ఎన్ఆర్ఈజీఏ జారీ చేసే జాబ్ కార్డ్, మీ పేరు & చిరునామా వివరాలతో జాతీయ జనాభా రిజిస్టర్ జారీ చేసే ఏదైనా ఒక లేఖ. ఇందులో ఏదైనా ఒక పత్రం అవసరం.
ఎస్‌బీఐ డీమ్యాట్ & ట్రేడింగ్ అకౌంట్ కోసం:
పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్
పాన్ కార్డ్ కాపీ
ఆధార్ కార్డు కాపీ
ఒక క్యాన్సిల్ చేయబడ్డ చెక్ లీఫ్/తాజా బ్యాంక్ స్టేట్ మెంట్
Experience the power of 3-in-1!
— State Bank of India (@TheOfficialSBI) December 15, 2021
An account that combines Savings Account, Demat Account, and Trading Account to provide you with a simple and paperless trading experience. To know more, visit -https://t.co/Mvt7i2K3Le#Go3in1WithSBI #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/3RDWUZEgIF