SBI: బంపర్‌ ఆఫర్‌..! కార్డు తీసుకుంటే రూ.4,999 విలువైన Smart Watch ఉచితం..! ఇంకా మరెన్నో ఆఫర్లు

Top Post Ad

 SBI:  బంపర్‌ ఆఫర్‌..! కార్డు తీసుకుంటే రూ.4,999 విలువైన Smart Watch ఉచితం..! ఇంకా మరెన్నో ఆఫర్లు.

SBI Pulse Credit Card Benefits: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ సరికొత్త క్రెడిట్‌ కార్డుతో ముందుకొచ్చింది. ఫిట్‌నెస్‌, హెల్త్‌ ఔత్సాహికులను దృష్టిలో ఉంచుకొని ‘ ఎస్బీఐ కార్డ్‌ పల్స్‌ ’ను లాంచ్‌ చేసింది.  వీసా సిగ్నేచర్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రారంభించిన ఈ పల్స్ క్రెడిట్‌ కార్డుపై వార్షిక సభ్యత్వ ఛార్జీ కింద రూ. 1,499ను ఎస్బీఐ వసూలు చేయనుంది.

చదవండి : ప్రపంచంలోనే చీపెస్ట్‌ INTERNET ప్యాక్‌.. ఒక్క రూపాయికే 

పల్స్‌ క్రెడిట్‌ కార్డును అందిస్తోన్న ఏకైక బ్యాంకింగ్‌ సంస్థగా ఎస్బీఐ నిలవనుంది. ఈ కార్డును తీసుకునే కస్టమర్లకు వెల్‌కమ్‌ గిఫ్ట్‌గా  రూ. 4,999 విలువైన నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ స్మార్ట్‌వాచ్‌ను సొంతం చేసుకోవచ్చునని ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా కార్డు వినియోగదారు కనీసం రూ. 2 లక్షలు ఏడాదిలోపు ఖర్చు చేస్తే వార్షిక సభ్యత్వ రుసుము నుంచి మినహాయింపు  కూడా వర్తిస్తోందని ఎస్బీఐ తెలిపింది.

చదవండి : SBI OFFERS: ఎస్‌బీఐ పండగ ఆఫర్లు..

ఏడాదిపాటు ఫిట్‌పాస్‌ ప్రో సభ్యత్వం..!

ఎస్బీఐ పల్స్‌  క్రెడిట్‌ కార్డును తీసుకున్న కస్టమర్లకు ఏడాది పాటు ఫిట్‌పాస్‌ ప్రో సభ్యత్వాన్ని కాంప్లిమెంటరీ ఎస్బీఐ అందిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా 4,000కు పైగా జిమ్స్‌ను, ఫిట్‌నెస్ స్టూడియోల క్యూరేటెడ్ నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయవచ్చును. అంతేకాకుండా కస్టమర్‌లకు యోగా, డ్యాన్స్, కార్డియోతో సహా అపరిమిత ఆన్‌లైన్ ఫిట్‌నెస్ సెషన్‌లు కూడా లభించనున్నాయి.

ఆరోగ్య-కేంద్రీకృత కార్డ్ కాబట్టి అనేక ఇతర జీవనశైలి ప్రయోజనాలు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. వివిధ వైద్య ప్రయోజనాలతో పాటు, కస్టమర్లు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఇంధన ఛార్జీ మినహాయింపులను పొందవచ్చును. ప్రయాణ . బీమా ప్రయోజనాలను కూడా ఎస్బీఐ అందిస్తోంది. ఒక ఏడాది పాటు ఉచిత నెట్‌మెడ్స్‌ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ రానుంది. అంతేకాకుండా మెడికల్‌ షాపులు, ఫార్మసీలు, సినిమాలు, డైనింగ్‌లలో షాపింగ్ చేయడంపై 5 రేట్ల రివార్డ్ పాయింట్లను కూడా పొందవచ్చును. 

Below Post Ad

Tags

Post a Comment

0 Comments