sugar patients : షుగర్ పేషేంట్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఆ.. కణాలను’ తొలగిస్తే.. శాశ్వత నివారణ అంటున్న శాస్త్రవేత్తలు

 Dysfunctional Cells: షుగర్ పేషేంట్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఆ.. కణాలను’ తొలగిస్తే.. శాశ్వత నివారణ అంటున్న శాస్త్రవేత్తలు.

Dysfunctional Cells: ప్రపంచ వ్యాప్తంగా షుగర్ వ్యాధి పేషేంట్స్ రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకసారి ఈ వ్యాధిబారిన పడితే ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. జీవితాంతం తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం.. అయితే డయాబెటిస్ రోగులకు శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. వయసు పెరిగే కొద్దీ శరీరంలో పేరుకుపోయే సెనెసెంట్‌ కణాల (విభజనకు గురయ్యే లక్షణాన్ని కోల్పోయినవి)ను తొలగిస్తే మధుమేహానికి బ్రేకులు వేయవచ్చునని కనెక్టికట్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే ఎలుకలపై ప్రయోగం చేసి సక్సెస్ అయ్యామని చెప్పారు.

చదవండి :మధుమేహానికి మెంతులు.. ఎలా ఉపయోగించాలంటే

ఊబకాయంతో ఉన్న ఎలుకలకు సెనెసెంట్‌ కణాలను తొలగించే ప్రయోగాత్మక మందులు డసాటనిబ్, క్యుయెర్‌సెటిన్‌లు ఇచ్చినప్పుడు వాటి మధుమేహ లక్షణాలు మాయమైపోయాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మింగ్‌ షూ తెలిపారు. ఊబకాయం, వ్యాయామలేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది మధుమేహుల్లో ఇనుల్సిన్‌ నిరోధకత ఉంటుంది. వాటితోపాటు కొవ్వులో ఉండే సెనెసెంట్‌ కణాలూ మధుమేహంపై ప్రభావం చూపుతున్నట్లు తాము గుర్తించామని మింగ్‌ షూ చెప్పారు. ఈ కణాలను తొలగిస్తే మధుమేహానికి బ్రేకులు పడ్డాయని వివరించారు.

చదవండి :మీకు కిడ్నీ లో రాళ్లు ఉన్నాయా... ఇవి అస్సలు  తినకూడదు

డసాటనిబ్, క్యుయెర్‌సెటిన్‌లను తాము మానవ కొవ్వు కణజాలంపై ప్రయోగించినప్పుడు అందులోని సెనెసెంట్‌ కణాలు నశించాయని వివరించారు. ఊబకాయుల నుంచి సేకరించిన ఈ కణజాలాన్ని ఎలుకలకు అమర్చినప్పుడు మధుమేహ లక్షణాలు తగ్గాయని చెప్పారు. మానవుల్లోనూ ఈ మందుల ప్రభావం ఇదేలా ఉంటుందా? అన్నది పరిశీలించేందుకు త్వరలో విస్తృత ప్రయోగాలు చేస్తామన్నారు.

చదవండి :

1. మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా..!

2. వెల్లుల్లి, తేనె కలిపి తీసుకుంటే బరువు తగ్గడం ఖాయం

3. మీ రోగనిరోధక శక్తి (Immunity) స‌రిగ్గా ఉందా, లేదా ? ఇలా గుర్తించండి..!


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad