Tokenization: కార్డులు లేకుండానే..ఆన్ లైన్ షాపింగ్.. పూర్తి వివరాలు

 Tokenization : కార్డులు లేకుండానే..ఆన్ లైన్ షాపింగ్, ‘టోకనైజేషన్’ అంటే ఏమిటీ ? పూర్తి వివరాలు/

Online Shopping : ఇక నుంచి కార్డులు లేకుండానే ఆన్ లైన్ లో షాపింగ్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ షాపింగ్ లో దిగ్గజాలైన అమెజాన్, ప్లిఫ్ కార్ట్, బిగ్ బాస్కెట్..ఇతరత్రా ఆన్ లైన్ వెబ్ సైట్ లలో షాపింగ్ మరింత సులభతరం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తోంది. అందుకనుగుణంగా మార్పులు, చేర్పులు చేస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా 2022, జనవరి నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండానే ఆన్ లైన్ షాపింగ్ చేసేందుకు కొత్త చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రజల సమాచారం కూడా భద్రంగా వీలు ఉండే అవకాశం ఉందని వెల్లడిస్తోంది. ఇందుకు ‘టోకనైజేషన్’ అనే కొత్త పద్దతిని ప్రవేశపెట్టింది. దీని ద్వారా..కాంటాక్ట్ లెస్ చెల్లింపులు చేయవచ్చు.

అసలు టోకనైజేషన్ అంటే ఏమిటీ ?

– వ్యక్తిగత సమాచారం సంబంధం లేకుండా..కొనుగోళ్లు సజావుగా సాగే విధానమే టోకనైజేషన్. బ్యాంకింగ్ కోసం సీవీవీ నెంబర్ ఇకపై అవసరం ఉండదు.

– ఉత్పత్తులను కొనుగోలు చేసే క్రమంలో..తమ కార్డు యొక్క పూర్తి సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది.

– షాపింగ్ వెబ్ సైట్ కు చెందిన చెక్ అవుట్ పేజీలో కార్డు వివరాలను నమోదు చేయాలి. అనంతరం టోకనైజేషన్ సెలక్ట్ చేసుకోవాలి.

– తమకు నచ్చినన్ని కార్డులను టోకనైజ్ చేసుకొనే ఛాన్స్ ఉంది. విదేశీ కార్డుల్ ఇది వర్తించదు.

– దీని ద్వారా మోసాలకు తావుండదని ఆర్బీఐ వెల్లడిస్తోంది. కొనుగోలుదారు సమాచారాన్ని సేకరించడం హ్యాకర్లకు అంత సులభం కాదంటోంది.

– ఇకపై 16 అంకెల కార్డు వివరాలను, కార్డు గడువు తేదీని గుర్తించుకోవాల్సిన అవసరం ఉండదు.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad