ఉద్యోగ సంఘాల్లో YCP మార్క్ విభజన !

 ఉద్యోగ సంఘాల్లో వైసీపీ మార్క్ విభజన !


ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు నిరసనలు ప్రారంభించాయి. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామన్న జగన్ మాటను ఉద్యోగులు నమ్మడం లేదు. ఒక్క పీఆర్సీ కాదు ఇంకో 70 సమస్యలు ఉన్నాయని బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు అనే ఇద్దరు నేతలు చెలరేగిపోతున్నారు. వీరిద్దరినీ నిన్నామొన్నటి వరకూ కంట్రోల్‌లో పెట్టిన సజ్జల ఇప్పుడు ఎందుకో కానీ పెద్దగా దృష్టి పెట్టడం లేదు. దీంతో వారు స్వేచ్చగా ఉద్యమం చేసుకుంటున్నారు. నిరసనలు ప్రారంభించారు. ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే వైసీపీ వ్యూహం వైసీపీకి ఉందని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తేల్చేస్తున్నాయి. 

చదవండి : AP లో ” 5 % ” రూల్..! ఇక అందరికీ వర్తింపు ?

కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావులపై ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వస్తున్నారు. ఏపీ రెవిన్యూ జేఏసీ చైర్మన్‌గా ప్రకటించుకున్న వీ.ఎస్. దివాకర్ అనే నేత ముఖ్యమంత్రిపై నమ్మకం ఉందని ప్రకటన చేశారు. బొప్పరాజు చంద్రబాబు వద్ద రెండు కోట్లు తీసుకున్నారని ఆయనపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రెజరీ ఉద్యోగుల సంఘం పేరుతో తెరపైకి వచ్చిన కొందరు కూడా ఇదే తరహా ప్రకటనలు చేస్తున్నారు. 

చదవండి : వన్ అండ్ ఓన్లీ క్యాపిటల్ Visakha... ?

ఇక సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రామిరెడ్డి గురించి చెప్పాల్సిన పని లేదు. ఉద్యోగుల కన్నా ఆయన సామాజిక బాధ్యత ఉందని చెప్పుకుంటారు. ఇటీవల సలహాదారు పదవి పొందిన చంద్రశేఖర్ రెడ్డి..తనకు ఉన్న పలుకుబడితో ఉద్యోగ సంఘాల మధ్య చిచ్చు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఏపీ ఎన్జీవోకు అధ్యక్షుడిగా చేసి వెళ్లినా ఇప్పుడు ఆ సంఘాన్ని బలహీనపరచడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారని.. అందులో భాగంగా తనకు అనుకూలమైన వ్యక్తులతో వ్యతిరేకత ప్రకటనలు ఇప్పిస్తున్నారన్న చర్చలు ఉద్యోగుల్లో జరుగుతున్నాయి. 

ఇప్పటికైతే బొప్పరాజు, బండి శ్రీనివాసరావులపై ఎదురుదాడి ప్రారంభమయింది. ముందు ముందు మరింత ఎక్కువగా ఉద్యోగ సంఘం నేతలపై ఎదురుదాడి ఉంటుందని.. చివరికి వారు కూడా వెనక్కి తగ్గక తప్పదన్న అభిప్రాయం ఉద్యోగుల్లోనే వినిపిస్తోంది. అయితే మెజార్టీ ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఇప్పుడు తాము వెనక్కి తగ్గితే జీతాలు కూడా సరిగ్గా పని పరిస్థితుల్లో తాము దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వరని వారు ఆందోళన చెందుతున్నారు

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad