Andhra Pradesh: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలు

 Andhra Pradesh: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం


ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 

➧ కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై ఈ భేటీలో చర్చించారు. 

➧ ఒమిక్రాన్‌ కట్టడికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయపడింది. 

➧ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలను యథాతథంగా అమలు చెయ్యాలని కేబినెట్ నిర్ణయించింది. 

➧ దీంతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

➧ ఇక కరోనా కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

➧ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ కారుణ్య నియామకాలు జరపాలని నిర్ణయించింది. 

➧ ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

➧ జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

➧ ఉద్యోగులకు 20 శాతం రిబేట్‌.. పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపునకు పచ్చజెండా ఊపింది. 

➧ ‘ఈబీసీ నేస్తం’ చెల్లింపులతో పాటు వారానికి నాలుగు సర్వీసులు నడిచేలా ఇండిగో సంస్థతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 

➧ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏడాది పాటు ఈ ఒప్పందం అమలుకు రూ.20 కోట్లు చెల్లించేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 

➧ మహిళా శిశు సంక్షేమ శాఖలో అమలు చేస్తున్న ఐసీడీఎస్ ప్రాజెక్టుకు పౌష్టికాహారం బాలామృతం, పాలు సరఫరాను గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్‌కు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad