AP Corona Cases: గుడ్ న్యూస్.. ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

 AP Corona Cases: గుడ్ న్యూస్.. ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఒక్క రోజులో ఎన్ని నమోదయ్యాయంటే!

దేశంలో కరోనా థర్డ్ వేవ్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజూవారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. ఈ నేపధ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ కోవిడ్(Covid) పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో భారీ పాజిటివ్ కేసులు తగ్గాయి. తాజాగా 5,879 పాజిటివ్ కేసులు, 9 మరణాలు సంభవించాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 22, 76,370 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 21,51,238 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. అటు 14,615 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,10,517 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా అనంతపురంలో అత్యధికంగా 856 కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. అనంతపురంలో 856, చిత్తూరు 295, తూర్పు గోదావరి 823, గుంటూరు 421, కడప 776, కృష్ణ 650, కర్నూలు 483, నెల్లూరు 366, ప్రకాశం 321, శ్రీకాకుళం 80, విశాఖపట్నం 340, విజయనగరం 12, పశ్చిమ గోదావరిలో 456 కేసులు నమోదయ్యాయి.



Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad