AP Corona Virus: ఏపీ స్కూల్స్ లో కరోనా కలకలం.. ఒక్కరోజు లోనే భారీగా కోవిడ్ బారిన పడిన టీచర్స్.

 AP Corona Virus: ఏపీ స్కూల్స్ లో కరోనా కలకలం.. ఒక్కరోజు లోనే భారీగా కోవిడ్ బారిన పడిన టీచర్స్.

AP Corona Virus: ఆంధ్రప్రదేశ్ (andhrapradesh) లో పలు పాఠశాలల్లో కరోనా (Corona Virus) మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో(Prakasham District) ఒక్కరోజులోనే 17 మంది పశ్చిమ గోదావరిలో 7 గురు  పాఠశాల సిబ్బందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. బాధితులలో 21 మంది ఉపాధ్యాయులు, ముగ్గురు  బోధనేతర సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం బాధితులు హోం ఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నారు.

OPEN: FA2 MARKS ENTRY LINK ENABLED 

అంతేకాదు ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, అద్దంకి, సింగరాయకొండ, టంగుటూరు, కొణిజేడు, పంగులూరు, యద్దనపూడి మండలాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. ఒంగోలు డీఆర్ఎం, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, అద్దంకి మండలం తిమ్మాయపాలెం, చిన్నగంజాం జెడ్పీ హైస్కూల్‌లో ఇద్దరికి చొప్పున కరోనా సోకింది. ఇక ఒంగోలు కేంద్రీయ విద్యాలయం, మార్కాపురం శారదా ఎయిడెడ్ స్కూల్, కనిగిరి నందన మారెళ్ల, సింగరాయకొండ మండలం కలికివాయి, టంగుటూరు మండలం కొణిజేడు, పంగులూరు మండలం రేణిగంవరం, సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం, యద్దనపూడి మండలం యనమదల, గన్నవరం ఎంపీపీఎస్ స్కూళ్లలో ఒకొక్క టీచర్ కు కరోనా వైరస్ సోకినట్లు అధికారులు చెప్పారు. ఇలా ఒక్కసారిగా స్కూల్స్ లో కరోనా కేసులు పెరగడానికి కారణం.. సంక్రాంతి సెలవులను ప్రభుత్వం పొడిగించక పోవడమే అంటూ పలువురు విమర్శిస్తున్నారు. స్కూల్స్ లో కరోనా కేసులు పెరిగిపోతుండంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్కూల్స్ కు హాలీడేస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

READ: 10th Class All Subjects Notes (E.M&T.M) - New Syllabus -2021-22

మరోవైపు ఏపీలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. ఒక్కరోజులోనే 6900  కొత్త కేసులు నమోదయ్యాయి

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad