AP లో నైట్‌ కర్ఫ్యూ.. ఎప్పటి నుంచి ఎప్పటి దాకా అంటే..

AP లో నైట్‌ కర్ఫ్యూ.. ఎప్పటి నుంచి ఎప్పటి దాకా అంటే..


సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నైట్‌ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. త్వరల వైద్య ఆరోగ్య శాఖ  మార్గదర్శకాలు జారీ చేయనుంది. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపాలని, మాస్క్‌ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది

కోవిడ్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌ విస్తరణ, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. దేశవ్యాప్తంగా వైరస్‌ విస్తరిస్తున్న విషయాన్ని  అధికారులు వివరించారు. కోవిడ్‌ సోకిన వారికి దాదాపుగా స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని అధికారులు తెలిపారు. కోవిడ్‌లో ఒమిక్రాన్‌ లాంటి కొత్త వేరియంట్‌ నేపథ్యంలో మార్పు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆ మేరకు హోం కిట్‌లో మార్పులు చేయాలన్నారు. వైద్యనిపుణులతో సంప్రదించి ఇవ్వాల్సిన మందులను సిద్ధంచేయాలన్నారు. అంతేకాక చికిత్సలో వినియోగించే మందుల నిల్వలపై సమీక్ష చేయాలని, అవసరం మేరకు వాటిని కొనుగోలుచేసి సిద్ధంగా ఉంచుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

►104 కాల్‌ సెంటర్‌ను బలంగా ఉంచాలన్న సీఎం

►ఎవరు కాల్‌చేసినా వెంటనే స్పందించేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం

►కోవిడ్‌ కేర్‌ సెంటర్లను కూడా సిద్ధం చేయాలన్న సీఎం

►నియోజకవర్గానికి ఒక కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్న సీఎం

►అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం

►కోవిడ్‌ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలన్న సీఎం

►భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలన్న సీఎం

►మాస్క్‌లు ధరించకపోతే జరిమానాను కొనసాగించాలన్న సీఎం

►దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ ఆంక్షలు పాటించేలా చూడాలన్న సీఎం

►బస్సు ప్రయాణికులు కూడా మాస్క్‌ ధరించేలా చూడాలన్న సీఎం

►బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో 100 మంది మించకుండా చూడాలని ఆదేశం

►థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలని ఆదేశం, మాస్క్‌తప్పనిసరి చేయాలని ఆదేశం

►రాత్రి 11 గంటలనుంచి ఉదయం 5 గంటలవరకూ కర్ఫ్యూ ఉంచాలని ఆదేశం

►దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌ ధరించేలా చూడాలన్న సీఎం

►ఈ మేరకు  వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేయనుంది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad