• ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు నమోదుకు ప్రత్యేక యాప్
• ఒక్క ఫొటోతో విద్యార్థుల అటెండెన్స్ స్వీకరణ పూర్తి
• పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా ఎంపిక • ఇబ్రహీంపట్నంలో ప్రయోగాత్మకంగా అమలు
• అక్కడ విజయవంతం కావడంతో
• నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా శ్రీకారం
• ఉపాధ్యాయులపై భారం లేకుండా చర్యలు
మచిలీపట్నం: కోవిడ్తో కుదేలైనా విద్యారంగాన్ని మళ్లీ గాడిన పడేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటూనే, వారిని బడిబాట పట్టించి, చదువులు సవ్యంగా సాగేలా దృష్టి సారిం చింది. ఈ నేపథ్యంలోనే పాఠశాలల్లో హాజరు నమోదు తప్పనిసరి చేసింది. ఇందుకోసమని ప్రత్యేకంగా యాప్ను _రూపొందించింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో గల పాఠశాలలో సోమవారం నుంచి యాప్ ద్వారానే విద్యార్థుల హాజరు నమోదు. చేయాల్సి ఉంది. విద్యాశాఖ కమిషనరేట్ నుంచి వచ్చిన ఆదేశాలతో జిల్లా విద్యాశాఖాధికారులు దీన్ని పక్కాగా అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇబ్రహీంపట్నంలో తొలి ప్రయోగం..
READ:
ఫిబ్రవరి నెలలోSBI శాలరీ అకౌంట్ ఉన్నవారు ఒక లక్ష వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఇంటి నుంచే పొందొచ్చు
SBI వినియోగదారులకు శుభవార్త.. తక్కువ వడ్డీకే 3 రకాల లోన్స్!
విద్యార్థుల హాజరును బయోమెట్రిక్ ద్వారా నమోదు చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు బయో మెట్రిక్ స్థానంలో హాజరు నమోదుకు ప్రత్యేక యాప్ సిద్ధం చేశారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలో ఇలా యాప్ ద్వారా ఇప్పటికే హాజరు నమోదు చేస్తున్నారు. ఇక్కడ విజయవంతం కావ టంతో రాష్ట్రంలో మొదటిగా కృష్ణా జిల్లాలోనే |పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి యాప్ ద్వారా హాజరు నమోదు చేయాలని నిర్ణయించి, దీనిని సోమవారం నుంచి అమలు చేస్తున్నారు. ఫొటో తీసి అప్లోడ్ చేయడమే..
విద్యార్థుల హాజరు నమోదుకు 'స్టూడెంట్ అటెం'డెన్స్ యాప్' అనే ప్రత్యేక యాప్ను ప్రభుత్వం సిద్ధం చేసింది. చైల్డ్ ఇన్ఫోతో అనుసంధానమై ఉన్న యాప్ను 'స్కూల్ యూడైస్ కోడ్ ను యూజర్ ఐడీగా, 'ఎస్ఐఎంఎస్' పాస్వర్డ్ ద్వారా యాప్ను ఓపెన్ చేయాలి.
• పాఠశాల మొదటి పీరియడ్లోనే హాజరు నమోదు చేయాలి. పాఠశాల లొకేషన్ యాప్లో చూపిస్తుంది. తరగతి వారీగా గదుల్లో కూర్చొన్న విద్యార్థులందరినీ యాప్ ద్వారా ఫొటో తీసి, ఆ తర్వాత వరుసగా హాజరు నమోదు చేయాలి. ఆ రోజు ఎంతమంది వాస్తవంగా బడికి వచ్చారనేది స్పష్టమైన లెక్క తేలుతుంది.
• గతంలో బయోమెట్రిక్ విధానంతో ప్రతి ఒక్క విద్యార్ధి చైల్డ్ ఇన్సో నంబర్ ఓపెన్ చేసి హాజరువే యాల్సి ఉండేది. దీని వల్ల ఉపాధ్యాయులకు ఎక్కువ సమయం పట్టేది. ప్రస్తుతం యాప్ ద్వారా హాజరు నమోదు వల్ల ఉపాధ్యాయులకు భారం తగ్గుతుంది.