EMPLOYEES SALARIES : రాష్ట్రంలో నేటికీ పడని జీతాలు, పెన్షన్లు

 రాష్ట్రంలో నేటికీ పడని జీతాలు, పెన్షన్లు

అమరావతి: మొదటి తేదీన జీతాలు అందుకోవడం ప్రభుత్వ ఉద్యోగులకు  గతకాలపు తియ్యని జ్ఞాపకంగానే మిగిలిపోతోంది. ఈ నెల కూడా  ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందలేదు. ప్రభుత్వ పెన్షనర్లకు వారి ఖాతాల్లో నగదు పడలేదు. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పెన్షనర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా పది లేదా 15వ తేది వరకు వంతుల పద్ధతిలో నగదు జమవుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. రాష్ట్రంలో నేటికీ పడని జీతాలు, పెన్షన్లు పడలేదు. ఇప్పటివరకు సగం మంది ఉద్యోగులకు మాత్రమే వేతనాలు అందాయి. ప్రభుత్వ ఖజానాలో ఉన్న నిధులను రైతు భరోసాకు మళ్లించారు. 

ఖజానాలో నిధులు లేకపోవడంతో జీతాలు, పెన్షన్లు ఇవ్వలేదు. కేంద్రం నుంచి అదనపు అనుమతి వస్తేనే వేతనాలు, పెన్షన్లు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. జీతాలు, పెన్షన్ల కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కలిపి 9 లక్షల వరకు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 1నే ఠంచనుగా జీతాలు, పెన్షన్లు అందేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో బాగున్నా.. తర్వాత గాడి తప్పింది. జీతాలు, పెన్షన్లను 1 నుంచి 15వ తేదీ వరకు విడతల వారీగా ఇస్తున్నారు. 

జీతాలో జగనన్నా..’ 

రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులు, పెన్షన్‌ తీసుకునే రిటైర్డ్‌ ఉద్యోగులు ‘జీతాలో జగనన్నా..’ అని వేడుకుంటున్నారు. కొత్త సంవత్సరంలోనూ చేతిలో పైసా లేక.. తమకివేం కష్టాలని ఆవేదన చెందుతున్నారు. రిటైరైన ఉద్యోగుల్లో ఒక్కరికి కూడా సోమవారం రాత్రి 7 గంటల వరకు పెన్షన్‌ పడలేదు. రెగ్యులర్‌ ఉద్యోగుల్లో సగంమందికే వేతనాలు పడగా, మిగిలిన సగం మంది ఇంకా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ని ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లకు కలిపి నెలకు రూ.5,500 కోట్లు చెల్లించాలి. ఇందులో సగం కంటే తక్కువే జగన్‌ ప్రభుత్వం చెల్లించినట్టు తెలుస్తోంది.  ఔట్‌సోర్సింగ్‌, కాంట్రా క్టు ఉద్యోగులకూ వేతనాలివ్వలేదు

ఏ రోజుకారోజు ఏ గంటకాగంట బ్యాంకు ఖాతాలు చెక్‌ చేసుకుంటూ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దాదాపు ఏడాదిన్నర నుంచి తమకు వేతనాలు సకాలంలో అందడం లేదని, దీని వల్ల తాము అప్పులపాలవుతున్నామని ఆ వేదన వ్యక్తం చేశారు. అలాగే, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీసం 3  నుంచి 11 నెలల వరకు వేతనాల బకాయిలున్నాయి. వారి కోసం ఆప్కాస్‌ పేరుతో ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆ కార్పొరేషన్‌ వల్ల ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏం ప్రయోజనం కలుగుతుందో? ఏం ఆశించి ఆ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. సకాలంలో జీతాలివ్వలేనప్పుడు, నెలల తరబడి  వేతనాల బాకాయిలున్నప్పుడు ఆ కార్పొరేషన్లు ఉంటే ఏమి? లేకపోతే ఏమని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అంతన్నాడింతన్నాడో..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులపై ప్రేమ కురిపించి, క్రమబద్ధీకరిస్తామంటూ హామీలిచ్చి మోసం చేసిన  అధికారంలోకి వచ్చాక వారికి కనీసం సకాలంలో వేతనాలివ్వడం లేదు. క్రమబద్ధీకరణ హామీ ఊసే ఎత్తడం లేదు. వీరితోపాటు వివిధ పథకాల కింద నియమించిన ఉద్యోగులు, కార్పొరేషన్ల ఉద్యోగులు, కొన్ని హెచ్‌ఓడీ కార్యాలయాల ఉద్యోగులకూ ఇంకా వేతనాలు అందలేదు. 

మళ్లీ అప్పు పుడితే గానీ..ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన జీతాలు గానీ, అవ్వాతాతల పెన్షన్లు గానీ ఆర్‌బీఐ వద్ద వేజ్‌ అండ్‌ మీన్స్‌, స్పెషల్‌ డ్రాయల్‌ లిమిట్స్‌, ఓడీ అప్పు తీసుకొచ్చి అరకొరగా చెల్లించారు. ఇక ఆర్‌బీఐ వద్ద అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేదు. రాష్ట్ర సెక్యూరిటీలు వేలం వేసి అప్పు తెచ్చుకునే పరిమితి కూడా దాటిపోయింది. అప్పు కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారా బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ అవి ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ రిజర్వు బ్యాంకు ద్వారా సెక్యూరిటీలు వేలం వేసి అప్పు తెచ్చుకోవడానికి కేంద్రం అనుమతిస్తుందేమోనని రాష్ట్రం ఎదురుచూస్తోంది. దీనికోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి, కార్యదర్శులు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. సోమవారం ముఖ్యమంత్రి జగన్‌ కూడా ఢిల్లీ వెళ్లారు. ఒకవేళ కేంద్రం కొత్త అప్పులకు అనుమతిస్తే ఆ లేఖను ఆర్‌బీఐకి చూపించి కొత్తగా అప్పు తెచ్చి వాటితో ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు చెల్లించే అవకాశాలున్నాయి.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad