BSNL: క్రేజీ ఆఫర్‌..! ఉచితంగా 5జీబీ డేటా..!

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ క్రేజీ ఆఫర్‌..! ఉచితంగా 5జీబీ డేటా..!


ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లతో ముందుకువస్తోంది. కొద్ది రోజుల క్రితం జియో పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్‌ తన యూజర్ల కోసం వార్షిక ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రూ. 2399 ఏకంగా 90 రోజుల అదనపు వ్యాలిడిటీని అందించిన విషయం తెలిసిందే. తాజాగా ఇతర నెట్‌వర్క్‌ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారే యూజర్ల కోసం క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది
చదవండి : 

స్విచ్‌ టూ బీఎస్‌ఎన్‌ఎల్‌...!

యూజర్ల బేస్‌ను పెంచుకునేందుకుగాను బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ఆఫర్‌ను ముందుకొచ్చింది. #switchtoBSNL అనే ప్రచారాన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రారంభించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారే కొత్త యూజర్లకు 5జీబీ హైస్పీడ్‌ డేటాను 30 రోజుల పాటు ఉచితంగా అందించనుంది. ఆయా యూజరు ప్రస్తుతం ఉన్న నెట్‌వర్క్‌ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్‌ ఐనా వారికే మాత్రమే ఈ ఆఫర్‌ వర్తించనుంది.  ఈ ఆఫర్‌ అన్ని సర్కిళ్లలో జనవరి 15 వరకు అందుబాటులో ఉండనుంది. 

షరుతులు వర్తిస్తాయి..!

బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తోన్న ఈ ఆఫర్‌ను సొంతం చేసేకునే కొత్త కస్టమర్లకు పలు షరతులను పెట్టింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌లోకి రావాలనుకునే సదరు యూజరు ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ప్లాట్‌ఫామ్స్‌లో   #switchtoBSNL ప్రచారాన్ని షేర్‌ చేయాలి. అంతేకాకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీ (@bsnlcorporate), ట్విట్టర్ హ్యాండిల్ (@BSNLcorporate) ఫాలో చేయాల్సి ఉంటుంది. ఆయా యూజర్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఎందుకుమారుతున్నారో కూడా సోషల్‌మీడియా హ్యండిల్స్‌లో తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పోర్ట్‌ కానున్న నంబర్‌నుంచి  9457086024 నంబర్‌కు స్క్రీన్‌షాట్లను పంపాల్సి ఉంటుంది. వీటన్నింటిని పరిశీలించి ఆయా యూజర్లకు 30 రోజుల పాటు 5జీబీ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ డేటాను బీఎస్‌ఎన్‌ఎల్‌ అందజేస్తుంది.  


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad