మన CPS PRAN అకౌంట్ నుండి PARTIAL WITHDRAWAL గురించి సందేహాలు - వివరణలు
Q1: బ్యాంక్ డీటైల్స్ అప్డేట్ ను ఇంటర్నెట్ లేదా ఆన్లైన్ లో చేసుకోవచ్చునా?
*🔹ఉద్యోగుల బ్యాంక్ డీటైల్స్ అప్డేట్ చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా అవకాశం లేదు. కేవలం S2 form నింపి DDO చే సంతకం చేయించి, దానికి బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీ జీరాక్స్ జతచేసి STO ఆఫీస్ నందు ఇవ్వాలి.
♦Q2) CPS ఉద్యోగులు Self declaration ద్వారా 25% పార్సియల్ withdraw చేసుకొనవచ్చునా?
🔹CPS ఉద్యోగి 25% withdraw అనేది Self declaration చేసే అవకాశం ఇంకా రాష్ట్ర ఉద్యోగులకు లేదు. దీనికి సంబందించి ఎటువంటి ఉత్తర్వులు treasury అధికారులకు యివ్వలేదు.
♦Q3) ప్రస్తుతం 25% withdraw కి ఏ సందర్భం లో చేయగలరు?
🔹ప్రస్తుతం CPS 25% withdraw చేయాలంటే supported document అనగా
🔹1) Marriage purpose లేదా
🔹2) Home loan purpose లేదా
🔹3) Higher education purpose of child or employee లేదా
🔹4) Medical purpose కి సంబందించిన ఏదోఒక supported document ఉంటేనే 25% పాక్షిక ఉపసంహరణ అవకాశం ఉంది.
♦Q4) 25% withdraw time లో మన Pran account లోని మొత్తం సొమ్ములో 25% ని చెల్లిస్తారా?
🔹25% పాక్షిక ఉపసంహరణకు కేవలం employee contribution మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
🔹ఉదా: ఒక cps ఉద్యోగి pran account లో contribution amount 7 లక్షలు & gained interest on cps amount 3 లక్షలు, మొత్తం 10 లక్షలు ఉంటే దానిలో contribution amount 7 లక్షలలో state matching grant 3.5 lakhs మినహాయించగా మిగిలిన employee 3.5 lakhs లో 25% మాత్రమే పాక్షిక withdraw కి లెక్కిస్తారు.
🔹 అనగా 87500 రూ"లు. ఇప్పటి వరకు employee contribute ద్వారా వచ్చిన వడ్డీని పాక్షిక withdraw కి లెక్కించడం లేదు.
♦Q5) partial withdraw కి తప్పకుండా నింపవలసిన ఫార్మ్స్ ఏవి?
🔹 25% withdraw కొరకు 601pw form నింపవలెను
♦Q6) CPS ఉద్యోగి 25% withdraw చేయడం వలన భవిష్యత్ లో ఏమైనా సమస్య ఉందా?
🔹ఎటువంటి సమస్య లేదు.
♦Q7) రిటైర్ అయిన CPS ఉద్యోగి తన అకౌంట్ లో ఉన్న మిగిలిన 40% amount total నుండి 25% withdraw చేయవచ్చునా?
🔹రిటైర్ అయిన cps ఉద్యోగులకు ఎటువంటి partial withdraw సదుపాయం లేదు.
♦Q8) 25% partial withdraw ద్వారా వచ్చిన అమౌంట్ ని ఆదాయపు పన్ను ( Income tax ) లో చూపించాలా?
🔹Income tax కి చూపించనవసరం లేదు. ఇది గతంలో మనం వార్షిక returns లో చూపించిన saving amount ఇది
Q9) ఒకసారి partial withdrawal చేసిన తరువాత ఎన్ని సంవత్సరాల తరువాత చేయాలి?
🔹5 సంవత్సరాల తరువాత.