Jio Phone 5G : జియో నుంచి అతని తక్కువ ధరకే 5G ఫోన్.. ధర ఎంత అంటే..!

 Jio Phone 5G : జియో నుంచి అత్యంత చౌకైన 5G ఫోన్.. ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Reliance Jio Phone 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం, డేటా సంచలనం రిలయన్స్ జియో నుంచి సరికొత్త 5G స్మార్ట్ ఫోన్ రాబోతోంది. అత్యంత చౌకైన ధరకే ఈ ఫోన్ భారతీయ మార్కెట్లో లాంచ్ కానుంది. 2022 ఏడాది నుంచే 5G విప్లవానికి జియో నాంది పలకనుంది. 5G టెక్నాలజీ విస్తరణలో రిలయన్స్ జియో ముందుడగు వేసింది. అందులో భాగంగానే అత్యంత చౌకైన ధరకే 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే తక్కువ ధరకే జియోఫోన్‌ Next 4G స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్‌ తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను జియో గూగుల్ భాగస్వామ్యంలో రూపొందించింది. ఇప్పుడు త్వరలోనే అత్యంత చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్ జియో లాంచ్ చేయనుంది.

ధర రూ. 10 వేల వరకు ఉండొచ్చు…

5G స్మార్ట్‌ఫోన్లలో ఇప్పటికే రియల్‌మీ, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లకు పోటీగా రిలయన్స్‌ జియో 5G స్మార్ట్‌ఫోన్‌ తీసుకొస్తోంది. ప్రస్తుతం 5G స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో రూ. 13 వేలకు అందుబాటులో ఉంది. అంతకంటే తక్కువ ధరకు 5G స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్‌ జియో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ 5G స్మార్ట్‌ఫోన్‌ దాదాపు రూ. 10 వేలకు అందుబాటులోకి రానుంది. Jio Phone 5G మెరుగైన హార్డ్‌వేర్ పనితీరుతో రానుందని నివేదిక పేర్కొంది. Jio Phone 5G Qualcomm Snapdragon 480 ప్రాసెసర్‌తో రానుంది. Qualcomm నుంచి చౌకైన 5G చిప్‌సెట్‌తో రానుంది. బడ్జెట్, మిడిల్ రేంజ్ ఫోన్లు కోరుకునే వినియోగదారులకు ఈ జియో 5G ఫోన్ పర్ ఫెక్ట్ అని చెప్పవచ్చు.

ALSO READ: 

మరొక జబర్దస్త్ అఫర్ ప్రకటించిన జియో..!

JIO సునామి అఫర్: 336 రోజుల అన్లిమిటెడ్ ప్లాన్ తెచ్చింది

Jio: జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్

అంతేకాదు.. ఈ జియో 5G ఫోన్.. N3, N5, N28, N40, N78 బ్యాండ్‌లకు సపోర్టు ఇస్తుంది. భారత మార్కెట్లోని అన్ని 5G నెట్‌వర్క్‌లకు సపోర్టు ఇస్తుంది. JioPhone 5G 4GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజీతో పాటు మైక్రో SD కార్డ్ స్లాట్‌తో వస్తుంది. Jio Phone 5G HD+ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల LCDతో రావచ్చు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుంది. జియో ప్రీలోడ్ యాప్ సూట్‌తో రానుంది. Jio Phone Next ఫోన్ Google- Android Go డెవలప్ చేసిన ఫోర్క్డ్ వెర్షన్ మాదిరి ప్రగతి OS కాకుండా Android పూర్తి లెవల్ వెర్షన్ తో రానుంది.

కెమెరా ఫీచర్లు ఇవేనా? :

రిలయన్స్ జియో మొదటి 5G ఫోన్‌ను 13-MP ప్రధాన రియర్ కెమెరాతో పాటు 2-MP కెమెరా, 8-MP సెల్ఫీ కెమెరాతో రానుంది. ఫ్రంట్ సైడ్ 8MP కెమెరాతో రానుంది. Jio Phone 5G USB-C పోర్ట్ ద్వారా 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందించనుంది. 5000mAh బ్యాటరీతో రానుంది. Jio Phone 5Gలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండే అవకాశం ఉంది. Jio Phone 5G లాంచ్ ఎప్పుడు అనేది జియో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. జూన్‌లో జరగనున్న ఈ ఏడాది వార్షిక వాటాదారుల సమావేశంలో రిలయన్స్ జియో 5G ప్లాన్‌లు, 5G ఫోన్‌ను ప్రకటించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

ONLINE BUY 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad