omicron: ఒమిక్రాన్ సోకిన‌వారిలో రోగ‌నిరోధ‌క శ‌క్తి

 ఒమిక్రాన్ సోకిన‌వారిలో రోగ‌నిరోధ‌క శ‌క్తి.. ఐసీఎంఆర్ స్ట‌డీలో కీల‌క అంశాలు

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్పుడు ఒమిక్రాన్ టెన్ష‌న్ పెడుతూనే ఉంది.. ఇక‌, భార‌త్‌లో ఒమిక్రాన్ ఎంట్రీ త‌ర్వాత క‌రోనా థ‌ర్డ్ వేవ్ పంజా విసురుతోంది.. వంద‌లు, వేలు.. ల‌క్ష‌లు దాటేస్తున్నాయి.. రోజువారి కేసులు.. ఈ స‌మ‌యంలో.. ఊర‌ట క‌లిగించే అంశాన్ని తెలిపింది ఐసీఎంఆర్ నిర్వ‌హించిన తాజా అధ్య‌య‌నం.. ఒమిక్రాన్‌ సోకినవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తలు తేల్చారు.. ఇది డెల్టాతో పాటు ఇతర కోవిడ్‌ వేరియెంట్లను కూడా సమర్ధవంతంగా ఎదుర్కోగ‌ల‌ద‌ని ప్ర‌క‌టించింది

ఐసీఎంఆర్ శాస్త్ర‌వేత్త‌ల అధ్య‌య‌నం ప్ర‌కారం.. అస‌లు ఒమిక్రాన్‌ వచ్చిన వారిలో తిరిగి డెల్టా వేరియెంట్‌ వచ్చే అవకాశమే లేద‌ని తేల్చింది.. ఐసీఎంఆర్ శాస్త్ర‌వేత్త‌లు 39 మంది వ్యక్తులపై ఓ అధ్యయనం చేశారు.. అయితే, వీరిలో 25 మంది ఆస్ట్రాజెనెకా టీకా రెండు మోతాదులను తీసుకోగా, ఎనిమిది మంది వ్యక్తులు ఫైజర్‌ రెండు డోసులు తీసుకున్నారు.. మ‌రో ఆరుగురు అసలు వ్యాక్సిన్ వేసుకోనివారున్నారు.. టీకా వేసుకున్నవారికంటే, వేసుకోనివారిలో ఈ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది.. మొత్తంగా ఒమిక్రాన్ సోకిన‌వారిలో రోగ నిరోధ‌క శ‌క్తి అధికంగా ఉంటుంద‌ని తేల్చింది..అయితే, ఒమిక్రాన్‌ బారిన పడిన తరువాత అతి తక్కువ సమయంలోనే ఈ స్ట‌డీ చేయ‌డం కూడా ఒక కార‌ణంగా చెబుతోంది ఐసీఎంఆర్.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad