PRC పీటముడి: ఉద్యోగ సంఘాలు, మంత్రుల కమిటీతో భేటీ.. సర్కార్ ముందు 3 డిమాండ్లు

 PRC  పీటముడి: ఉద్యోగ సంఘాలు, మంత్రుల కమిటీతో భేటీ.. సర్కార్ ముందు 3 డిమాండ్లు


పీఆర్సీ సహా ఇతర సమస్యలకు సంబంధించి మంత్రుల కమిటీని ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. 
3 కీలక అంశాలతో ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు  పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు. 
1.ఆశుతోష్ మిశ్రా కమిటీ నివేదికలను బయటపెట్టాలని.. 
2.పీఆర్సీ జీవోలను అబయెన్స్‌లో పెట్టాలని, 
3.జనవరి నెల పాత పీఆర్సీ ప్రకారం జీతాలను చెల్లించాలని 
లేఖలో కోరారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తే.. చర్చలకు సిద్ధమని లేఖలో తెలిపారు పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు. 

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ వివాదం (AP PRC Issue) కొనసాగుతుంది. ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం ఉద్యోగ సంఘాలు.. సమ్మెకు దిగడానికి సిద్దమయ్యాయి. ఈ క్రమంలోనే సోమవారం సచివాలయంలో జీఏడీ కార్యదర్శి శశిభూషణ్ సమ్మె నోటీసు ఇచ్చారు. మరోవైపు  ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులతో కోసం.. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, పేర్నినాని (Perni Nani), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 

ఈ కమిటీ చర్చలకు హాజరుకావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం పంపింది. అయితే పీఆర్సీ ఉత్తర్వులు రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చల విషయం ఆలోచిస్తామని పీఆర్సీ సాధన సమితి తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం ఉద్యోగుల కోసం సచివాలయంలో మంత్రుల కమిటీ వేచి చూసినప్పటికీ ఉద్యోగ సంఘాలు చర్చలకు వెళ్లలేదు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం   YS Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ పై ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందించలేదు. దీంతో సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి. ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలోని జీఏడీ సెక్రటరీ కార్యాలయానికి వెళ్లిన పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు సమ్మె నోటీసు ఇచ్చారు. 


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad