PRC NEWS: ఆ ఒక్కటీ తప్ప.. ఆల్‌ హ్యాపీ

 ఆ ఒక్కటీ తప్ప.. ఆల్‌ హ్యాపీ

ఫిట్‌మెంటే కొంత బాధ కలిగించింది

ఊహించని విధంగా సీఎం వరాలు 

కొన్ని కావాలన్నప్పుడు కొన్ని పోతాయి

పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలు 

అమరావతి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఒక్క ఫిట్‌మెంట్‌ తప్ప మిగిలినవన్నీ బాగున్నాయన్నారు. తాము ఊహించనవి కూడా సీఎం ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.

CHECK: బేసిక్ పే ఎంటర్ చేసి వివిధ HRA లకు మీ టోటల్ శాలరీ New PRC 23.29 % Fitment తో  చూసుకోండి

రిటైర్మెంట్‌ వయసు పెంచడం శుభపరిణామం:

ఎవరూ ఊహించని విధంగా ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు సీఎం పెంచడం శుభపరిణామం. సీఎస్‌ కమిటీ సిఫార్సులను పక్కనబెట్టి అశుతోశ్‌ మిశ్రా కమిటీ సిఫార్సు చేసినట్లు 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. దీనివల్ల 10 వేల కోట్లు ఖర్చవుతున్నా ఇవ్వడం సంతోషం. ప్రభుత్వానికి మేం 71 డిమాండ్లు పెట్టగా 50 డిమాండ్లకు పరిష్కారం దొరికింది. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు.  - బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ చైర్మన్‌ 

ఇదంతా జేఏసీల ఉద్యమ ఫలితమే:

 23 శాతం ఫిట్‌మెంట్‌ విషయంలో తప్ప అన్ని డిమాండ్ల పరిష్కారానికి సీఎం హామీ ఇవ్వడం సంతోషం కలిగించింది. 27 శాతం ఐఆర్‌ ఇస్తున్నందున 27 శాతం ఫిట్‌మెంట్‌ ఆశించాం. ఫిట్‌మెంట్‌ తగ్గడం మాకు కొంత బాధ కలిగించింది. కొన్ని కావాలన్నప్పుడు కొన్ని పోతాయి. మేం ఊహించని విధంగా సీఎం ఇళ్లు సహా రిటైర్మెంట్‌ హామీలు అదనంగా ఇచ్చారు. ఇదంతా ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంయుక్త ఉద్యమం ఫలితమే.  - బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌

23 శాతం ఫిట్‌మెంట్‌కు ఓకే:

 23% ఫిట్‌మెంట్‌కు అంగీకరిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సర్దుకుపోతున్నాం. మిగిలిన అంశాలు ఊహించిన దాని కంటే మిన్నగా ఉన్నాయి. జూన్‌ 30లోపు సీపీఎస్‌ రద్దుపై సీఎం నిర్ణయం తీసుకుంటారు.  - వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

ఊహించని విధంగా సీఎం వరాలు:

ఊహించని విధంగా ఉద్యోగులకు సీఎం వరాలు ఇచ్చారు. పెండింగ్‌ డీఏలన్నీ ఒకేసారి చెల్లిస్తామనడం రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. హామీలను పరిష్కరించిన సీఎంకు ధన్యవాదాలు.  -  వైవీరావు, ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నేత 

ఫిట్‌మెంట్‌పై పునరాలోచించాలి:

 ఫిట్‌మెంట్‌పై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. సెంట్రల్‌ పే కమిటీ ఆలోచన రాష్ట్రంలో వద్దు. హెచ్‌ఆర్‌ఏపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. పెండింగ్‌లో ఉన్న డీఏలన్ని ఒకేసారి ఇస్తామనడాన్ని ఆహ్వానిస్తున్నాం.  సెంట్రల్‌ పే స్కేల్‌ను, అశుతోశ్‌ మిశ్రా కమిషన్‌ నివేదికను బహిర్గతం చేయాలి. వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచడం మంచిదే. అయితే   నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడతారు. వారికి ఉద్యోగ అవకాశాలు దూరమవుతాయి. ప్రభుత్వం కూడా రిటైర్మెంట్‌ ప్రయోజనాలను వెంటనే చెల్లించలేని పరిస్థితిలో ఉంది. అందుకే రిటైర్మెంట్‌ వయసు పెంచింది.  - హృదయరాజు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad