2022 లో లేటెస్ట్ బెస్ట్ ప్లాన్ ప్రకటించిన జియో
రూ.2,999 ప్లాన్ డైలీ 2.5జిబి హై స్పీడ్ డేటా అన్లిమిటెడ్ కాలింగ్
ఒక సంవత్సరం అన్లిమిటెడ్ లాభాలను అందిస్తుంది
గత డిసెంబర్ 1వ తేదీ నుండి జియో తన ప్రీపెయిడ్ ప్లాన్ రేట్లను పెంచినా, కొత్త సంవత్సరంలో మాత్రం మంచి ప్రయోజాలను అందించే బెస్ట్ ప్లాన్స్ ను ప్రకటిస్తోంది. ఇటీవల తక్కువ ధరకే OTT లాభాలను అందించే Jio Rs.499 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించిన జియో, ఇప్పుడు డైలీ 2.5GB డేటాతో సహా మరిన్ని ప్రయోజనాలను తీసుకువచ్చే మరొక బెస్ట్ ప్లాన్ ను ప్రకటించింది. అదే, Jio Rs.2,999 ప్లాన్ మరియు ఇది 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.
చదవండి :
1. Pre Paid ఖాతాదారులకు మరోమారు షాకిచ్చిన JIO
JIO RS.2,999 PLAN
ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 912.5GB ల హాయ్ స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది
జియో అధికారిక వెబ్సైట్ లేదా మైహోమ్ జియో యాప్ నుండి 20% జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ కేటగిరిలో ఈ అఫర్ లిస్ట్ చెయ్యబడింది. ఇక ఇటీవల జియో ప్రకటించిన బెస్ట్ ప్లాన్ Jio Rs.499 Plan మరియు ఈ ప్లాన్ అందించే లాభాలను గురించి ఈ క్రింద చూడవచ్చు.
JIO RS.499 PLAN
ఈ ప్లాన్ కస్టమర్లకు అధికలాభాలను అందిస్తుంది. ఎందుకంటే, ఈ ప్లాన్ తో డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ను కూడా పొందుతారు. ఇది మాత్రమే కాదు, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. ఇది 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అధనంగా, పైన తెలిపిన విధంగా ఈ ప్లాన్ 1 సంవత్సరం 499 రూపాయల విలువైన డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది. కొత్త వినియోగదారులు ఈ ప్లాన్‌తో జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌కు కూడా సభ్యత్వాన్ని కూడా అందుకుంటారు.