TREASURY EMPLOYEES: AP ప్రభుత్వానికి ట్రెజరీ ఉద్యోగుల షాక్‌

 ఏపీ ప్రభుత్వానికి ట్రెజరీ ఉద్యోగుల షాక్‌

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి ట్రెజరీ ఉద్యోగుల షాకిచ్చారు. వేతన బిల్లులను ప్రాసెస్ చేయమని ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి చేయడాన్ని ట్రెజరీ ఉద్యోగుల సంఘం నిరసిస్తోంది. ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావడంలో ఆంతర్యమేంటో చెప్పాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తాము కూడా ఉద్యమంలో భాగమేనని ట్రెజరీ ఉద్యోగుల సంఘం స్పష్టం చేస్తోంది. 

ప్రభుత్వం పెండింగ్‌ డీఏలు మంజూరు చేసి.. జీతం పెరిగినట్లు చూపిస్తున్నారని ట్రెజరీ ఉద్యోగుల సంఘం అభ్యంతరం తెలుపుతోంది. హెచ్‌ఆర్‌ఏ స్లాబులో కోత విధించడం అన్యాయమని ట్రెజరీ ఉద్యోగులు వాపోతున్నారు. పలు జిల్లాల్లో వేతన బిల్లులను ట్రెజరీ ఉద్యోగులు ప్రాసెస్ చేయలేదు. ఈనెల 25లోగా బిల్లులను ప్రాసెస్ చేయాలని ఆర్థికశాఖ ఆదేశించారు. అయితే ట్రెజరీ ఉద్యోగులు, డ్రాయింగ్ అధికారులు నిరాకరించారు.

మరోవైపు పీఆర్సీపై ఏకపక్ష జీవోలు జారీ చేసిన సర్కారుపై  ‘సమ్మె అస్త్రం’ ప్రయోగించేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. వేర్వేరు సంఘాలన్నీ ఉమ్మడిగా కలిసి వచ్చి... ఉద్యమించాలని నిర్ణయించుకున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి... ‘జీతం తగ్గదు. పెరుగుతుంది. మీరే సరిగా అర్థం చేసుకోలేదు’ అన్నట్లుగా మాట్లాడటంపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. ‘న్యాయమైన పీఆర్సీయే లక్ష్యం’గా పోరాడాలని నిర్ణయించుకున్నారు. పీఆర్సీ రద్దు కోసం సమ్మెకు సైతం సిద్ధమని దాదాపు అన్ని సంఘాలు ప్రకటించాయి.

ఉద్యోగుల ఉద్యమం కీల‌క మ‌లుపు తిరుగుతోంది. పీఆర్సీ అనుబంధ సమ‌స్యల‌పై క‌లిసి ప‌నిచేద్దామని ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ పిలుపునిచ్చారు. సూర్యనారాయ‌ణ ప్రతిపాద‌న‌కు సచివాలయ ఉద్యోగ సంఘాల నేత వెంక‌ట్రామిరెడ్డి ఓకే చెప్పారు. ఇప్పటికే అన్ని సంఘాలు ఏక‌తాటిపైకి రావాల‌ని కోరామని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఇద్దరం కలిసి జేఏసీ నేత‌లు బొప్పరాజు, శ్రీనివాస‌రావుల‌ను క‌లుస్తామని, పీఆర్సీ సాధ‌న స‌మితి పేరుతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తామని సూర్యనారాయణ, వెంక‌ట్రామిరెడ్డి సంయుక్తంగా ప్రకటించారు. 



Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad