TS సర్కార్ కీలక నిర్ణయం.. 30వ తేదీ వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

 TS సర్కార్ కీలక నిర్ణయం.. 30వ తేదీ వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని విద్యాలయాలకు ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదివారం అధికారిక ప్రకటన జారీచేశారు. దీంతో కొద్దిరోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది.

POLL: ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ కి సెలవుల మీద మీ అభిప్రాయం ఏమిటి 

జనవరి తొలి వారంలోనే కేసుల సంఖ్య భారీగా పెరగడంతో సంక్రాంతి సెలవులను మూడు రోజులు ముందుకు జరిపి ఈనెల 8వ తేదీ నుంచే ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 16 వరకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. 17వ తేదీ నుంచి విద్యాలయాలు తెరుచుకుంటాయని స్పష్టం చేసింది. అయితే అప్పటితో పోలిస్తే తాజాగా కేసుల సంఖ్య మరింత పెరగడంతో ప్రభుత్వ కరోనా ఆంక్షలను 20వ తేదీ వరకు పొడిగించింది.

ఈ నేపథ్యంలోనే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కూడా పొడిగిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై సోషల్‌మీడియాలో రకరకాల ప్రచారాలు జరగడంతో సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లినవారు 17వ తేదీన విద్యాలయాలు తెరుచుకుంటాయా? లేదా? అని గందరగోళానికి గురయ్యారు. తాజాగా 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad