కంటైన్మెంట్ జోన్ల‌లో ఉద్యోగుల‌కు Work from Home

కేంద్ర ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం : కంటైన్మెంట్ జోన్ల‌లో ఉద్యోగుల‌కు work from home.

కరోనా వైరస్‌ మరోసారి దేశంలో విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతుండడంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. దేశంలో చాపకింద నీరులా ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రధాని మోడీ ధర్డ్‌వేవ్‌పై సమీక్ష నిర్వహించారు. ప్రజా రవాణాపై ఆంక్షలు, మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా, మందుల పంపిణీ, ముందస్తు నిల్వలు వంటి కీలక అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.

దేశ వ్యాప్తంగా క‌రోనా, ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉండే కంటైన్మెంట్ జోన్ల‌లోని కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులకు అంద‌రికీ వ‌ర్క్ ఫ్రం హోం కేటాయించింది. కంటైన్మెంట్ జోన్ల‌లో ఉండే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు వారి ప్రాంతంలో కంటైన్మెంట్ జోన్ తొలిగించేంత వ‌ర‌కు వ‌ర్క్ ఫ్రం హోం అవ‌కాశం ఉంటుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది

అలాగే దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల్లో ఉండే గ‌ర్భిణులు, దివ్యాంగులకు కూడా వ‌ర్క్ ఫ్రం హోం కేటాయిస్తు నిర్ణ‌యం తీసుకుంది. అయితే కంటైన్మెంట్ జోన్లలో ఉండే వారే కొన్ని చోట్లల్లో సూప‌ర్ స్పైడ‌ర్స్ ల ఉంటున్నార‌ని ఈ నిర్ణ‌యం తీసుకుంది. అలాగే క‌రోనా, ఓమిక్రాన్ ప్ర‌భావం గ‌ర్భిణులు, దివ్యాంగులపై ఎక్కువ చూపే ప్ర‌మ‌ధం ఉన్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం వారికి క‌రోనా పరిస్థితులు త‌గ్గే వ‌ర‌కూ వ‌ర్క్ ఫ్రం హోం కేటాయించింది.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad