LIC IPO:అతి త్వరలో ఐపీవో! 10 శాతం షేర్లు పాలసీదారులకు, 5 శాతం ఉద్యోగులకు


వచ్చేస్తోంది..  ఐపీవో! 
initial public offering (IPO)

ఎల్‌ఐసీ ఐపీవో మార్చిలోపే..

5 శాతం వాటా విక్రయంరూ.63 వేల కోట్ల సమీకరణ

సెబీ ముందుకు భారీ ఐపీవో ముసాయిదా పత్రాలు

10 శాతం షేర్లు పాలసీదారులకు, 5 శాతం ఉద్యోగులకు

Mumbai: The government plans to sell as much as 5% of its stake in Life Insurance Corp of India in the biggest initial public offering in the country to raise up to Rs 65,000 crore, making the insurer the biggest listed financial services provider ahead of HDFC Bank.

IPO documents filed with the regulator indicate the insurance behemoth may be valued in the excess of Rs 12.5 lakh crore, making it more valuable than all other listed government-owned companies.

న్యూఢిల్లీ: ఇప్పటివరకు వచ్చిన అన్ని పబ్లిక్‌ ఇష్యూ (ఐపీవో)లను తోసిరాజంటూ.. నేనే రాజంటూ దేశంలో అతిపెద్ద ఐపీవోకు రంగం సిద్ధమైంది. సగటు భారతీయుడి బీమా ధీమా.. భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) బాహుబలి ఇష్యూకు సంబంధించిన ముసాయిదా పత్రాల (డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్ట్‌స-డీఆర్‌హెచ్‌పీ)ను ప్రభుత్వం మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీకి సమర్పించింది. ‘ఎల్‌ఐసీ ఐపీవో కోసం ఆదివారం అవసరమైన ముసాయిదా పత్రాలను సెబీకి అందించాం. ఈ ఐపీవో ద్వారా ఎల్‌ఐసీ ఈక్విటీలో 5 శాతానికి సమానమైన ఒక్కోటి రూ.10 ముఖ విలువ (ఫేస్‌ వ్యాల్యూ) ఉండే 31.6 కోట్ల షేర్లను విక్రయిస్తాం’ అని ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్‌కాంత పాండే చెప్పారు. కంపెనీ భవిష్యత్‌ లాభాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత ఎంబడెడ్‌ విలువ రూ.5.4 లక్షల కోట్లు ఉంటుందని ప్రభుత్వం ఆ పత్రాల్లో పేర్కొంది. ఈ ఐపీవో ద్వారా ప్రస్తుత ఈక్విటీ నుంచే ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) విధానంలో ఐదు శాతం వాటాలు విక్రయిస్తారు. 

గత గరిష్ఠ ఐపీవోకు మూడు రెట్లపైనే..

ఎల్‌ఐసీ ఐపీవో ద్వారా ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.63 వేల కోట్లు సమకూరుతాయని అంచనా. గతేడాది మార్కెట్‌కు వచ్చిన పేటీఎం (రూ.18,300 కోట్లు), 2010 నాటి కోల్‌ ఇండియా (రూ.15,500 కోట్లు), 2008లో వచ్చిన రిలయన్స్‌ పవర్‌ (రూ.11,700 కోట్లు) పబ్లిక్‌ ఇష్యూలు అన్నిటినీ కలిపినా ఎల్‌ఐసీ ఇష్యూ కంటే తక్కువే కావడం గమనార్హం. దీంతో ఈ ఇష్యూ భారత ఐపీవో మార్కెట్లో అతిపెద్దది కానుంది. దీని కోసం కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ (ఇండియా) సెక్యూరిటీస్‌, సిటీ గ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా సహా మరో ఏడుగురు మర్చంట్‌  బ్యాంకర్లను ప్రభుత్వం నియమించింది.  

మార్చిలోపే పూర్తి

ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెలాఖరులోగా ఎల్‌ఐసీ ఐపీవోను పూర్తి చేయాలని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అలా అయితేనే ఈ ఐపీవో ద్వారా సమకూరే రూ.63,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2021-22) ద్రవ్య లోటు కొంతైనా పూడ్చుకునేందుకు ఉపయోగపడతాయి. ఇందుకు వీలైనంత త్వరగా సెబీ అనుమతి కోసం అధికార వర్గాలు చర్యలు చేపట్టాయి. సెబీ కూడా ఈ నెలాఖరు లేదా వచ్చే నెల 7లోగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తుందని భావిస్తున్నారు. దాంతో మార్చిలోగా ఐపీవో పూర్తి చేసి ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించిన రూ.78,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరాలని ప్రభుత్వం భావిస్తోంది. 

పాలసీదారులు, ఉద్యోగులకు రిజర్వేషన్‌

పబ్లిక్‌ ఇష్యూ ద్వారా ఎల్‌ఐసీ జారీ చేసే 31.6 కోట్ల షేర్లలో పది శాతం పాలసీదారులకు రిజర్వు చేశారు. వీరితోపాటు ఎల్‌ఐసీ ఉద్యోగులకూ ఐదు శాతం షేర్లు రిజర్వు చేస్తారు. ఇంకా యాంకర్‌ ఇన్వెస్టర్లు, క్వాలిఫైడ్‌ ఇన్వెస్టర్లు, రిటైల్‌ ఇన్వెస్టర్లకూ ప్రత్యేక కోటా ఉంటుంది. 

లిస్టింగ్‌ అనంతరమూ బాహుబలే!

కంపెనీ షేర్ల మార్కెట్‌ విలువ (మార్కెట్‌ క్యాప్‌) పరంగా చూస్తే.. ప్రస్తుతం దేశీయ స్టాక్‌ మార్కెట్లో రిలయన్స్‌ అగ్రస్థానంలో ఉంది. టీసీఎస్‌ ఆ తర్వాత ఉంది. లిస్టింగ్‌ అనంతరం ఎల్‌ఐసీ ఈ రెండు కంపెనీలను వెనక్కునెట్టి అగ్రస్థానంలో నిలుస్తుందని మార్కెట్‌ వర్గాల అంచనా.

హిట్టా? ఫట్టా?.. ఎఫ్‌ఐఐలు దెబ్బకొడతారా?

మరోవైపు ఎల్‌ఐసీ ఐపీవోకు మదుపరుల నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుందనే దానిపై రకరకాల అంచనాలు వినిపిస్తున్నాయి. దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐ), రిటైల్‌ మదుపరులు ఆసక్తితో ఉన్నా, విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐ).. ఎల్‌ఐసీ ఐపీవోపై అంతగా ఆసక్తిగా లేరనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎల్‌ఐసీ ఐపీవో సూపర్‌ డూపర్‌  సక్సెస్‌ కావాలంటే  ఎఫ్‌ఐఐల మద్దతూ కీలకమే. ఐపీవోలో పాల్గొనకుండా సెంటిమెంట్‌ను దెబ్బతీసి లిస్టింగ్‌ తర్వాత చౌకగా ఎల్‌ఐసీ షేర్లను దక్కించుకోవాలని ఎఫ్‌ఐఐలు చూస్తున్నట్టు సమాచారం.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad