Andhra Pradesh: ఏపీలో మార్చి 18 నాటికి కొత్త జిల్లాలు ప్రక్రియ పూర్తి

Andhra Pradesh: ఏపీలో మార్చి 18 నాటికి కొత్త జిల్లాలు ప్రక్రియ పూర్తి 

AP లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మార్చి 18 నాటికి పూర్తి చేసేలా  ప్రణాళికలు సిద్ధం చేసింది ప్రభుత్వం. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాలలో పాలనా కార్యక్రమాలు  ప్రారంభం కానున్నాయి. మార్చి నెల  మధ్యలో  జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లా కేంద్రాలుగా  కలెక్టర్లు, ఎస్పీలు డ్యూటీ  నిర్వర్తిస్తారు. కొత్త జిల్లాలకు ఉద్యోగులు, అధికారులను కేటాయించడం, మౌలిక వసతుల కల్పన, ఇతర చర్యలు పూర్తయ్యేంత వరకు కలెక్టర్లు, ఎస్పీలే పాత జిల్లాల బాధ్యతలను నిర్వర్తించే అవకాశాలు ఉంది . ఒకవేళ పాత జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చినా విభజన, మౌలిక వసతుల కల్పన వ్యవహారాలను మాత్రం వీరే పర్యవేక్షించనున్నారు.

చదవండి: AP కొత్త జిల్లాల పేర్లు, రాజధాని, విస్తీర్ణం తెలుసుకోండి 

కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అభిప్రాయ సేకరణ సూచనలు  జిల్లాల కలెక్టర్లు ప్రజల నుంచి  మార్చి 3వరకు స్వీకరిస్తారు. వీటిని మార్చి 10 వరకు పరిశీలించి తర్వాతి రోజు నివేదిక రూపంలో వివరాలను సచివాలయంలోని నిబంధనలు రూపొందించే వారి పరిశీలనకు పంపిస్తారు. మార్చి 15 నుంచి 17 మధ్య ఫైనల్  నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీనికి అనుగుణంగా 18న జిల్లాల్లో కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల అన్ని కార్యక్రమాలు అధికారికం గా  ప్రారంభమవుతాయి.

ఇవి చదవండి: 

కొత్త జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు ఎలా?

30 వేల మంది SGT / SA టీచర్లకు.. త్వరలో ప్రమోషన్‌...

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad