AP Employees Vs AP Govt : ఏపీలో పీఆర్సీ పంచాయితీ.. విద్యాశాఖ యాప్ డౌన్

 AP Employees Vs AP Govt : ఏపీలో పీఆర్సీ పంచాయితీ.. విద్యాశాఖ యాప్ డౌన్

AP PRC Issue : ఏపీలో పీఆర్సీ పంచాయితీ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. 2022, ఫిబ్రవరి 04వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి వరకు మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి కొన్నింటికి పరిష్కారం లభించగా..మరికొన్నింటిపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో… శనివారం జరిగే చర్చలు ఓ కొలిక్కి వస్తాయని భావిస్తున్నారు. చర్చలు సానుకూలంగా జరిగాయని రెండు కమిటీల ప్రకటించాయి. ఐఆర్, HRA, CCAపై చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి.

ఆర్థిక పరమైన అంశాల్లో స్పష్టత రావాల్సి ఉంది. ఉదయం 10 గంటలకు ప్రభుత్వ కమిటీ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు స్టీరింగ్ కమిటీతో మరోసారి చర్చలు జరుగనున్నాయి. సమ్మెకు వెళ్ళకుండానే సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఉద్యమం యధావిధిగా కొనసాగుంటుందని స్టీరింగ్ కమిటీ ప్రకటించింది. శనివారం పెన్ డౌన్ కొనసాగనుంది. ఉపాధ్యాయుల యాప్ డౌన్ చేయనున్నారు. విద్యాశాఖకు చెందిన యాప్ లను టీచర్లు డౌన్ చేయనున్నారు.

ఉద్యోగ సంఘాలతో చర్యలు సుదీర్ఘంగా సాగినట్లు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులు పాజిటివ్‌గా మాట్లాడినట్లు చెప్పారు.

చర్చలు ఆశాజనకంగా జరిగాయని.. సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాలను కోరినట్లు మంత్రి బొత్స తెలిపారు. సహాయ నిరాకరణకు వెళ్లకుండా చూడాలని ఉద్యోగ సంఘాలను మంత్రుల కమిటీ కోరింది. అయితే ఈ చర్చల్లో పీఆర్సీ నివేదికపై ఇంకా స్పష్టత రాలేదు. ఐఆర్‌ను వేతనాల నుంచి రికవరీ చేయబోమని మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చింది. సిటి కంపన్సేటరీ అలవెన్స్ పునరుద్దరణ అంశాన్ని పరిశీలిస్తామని మంత్రుల కమిటీ పేర్కొంది.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad