AP NEW DISTRICTS: కొత్త జిల్లాలలో ఒకే తరహా పోస్ట్ లు విలీనం

 వ్యవసాయ, అటవీ, విద్య, వైద్యశాఖల్లో జిల్లాస్థాయి పోస్టుల విలీనం

• జిల్లా కేంద్రంలో వాటన్నింటికీ ఒకే అధికారి, ఒకే కార్యాలయం

కొత్త జిల్లాల్లో కార్యాలయాలు, అధికారుల విభజనపై కసరత్తు


సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల్లో ఒకే తరహా జిల్లాస్థాయి కార్యాలయాలు, వాటి సమానస్థాయి ఉన్న క్యాడర్ పోస్టు లను విలీనం చేయనున్నారు. ఒక శాఖకు ఒక అధికారి, ఒక కార్యాలయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాల సంఖ్య రెట్టింపు అధికారుల కొరత లేకుండా ఈ విధానం అవలంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో సుమారు 100 వరకు జిల్లాస్థాయి కార్యాలయాలు, వాటిలో అదేస్థాయి క్యాడర్ అధికారులు పనిచేస్తున్నారు. పునర్వ్యవస్థీకరణ తర్వాత కొత్త జిల్లా కేంద్రాల్లో ఈ కార్యాలయాలను ఏర్పాటు చేసి అక్కడ అంతే సంఖ్యలో అధికారులను నియమించాల్సి ఉంటుంది. ఇందుకు ఎక్కువ కార్యాలయాలు, ఎక్కువ క్యాడర్ అధికారుల అవసరం ఉంటుంది. కానీ విభజనతో పని ఒత్తిడి తగ్గుతుంది. దీంతో ఒకే తరహా కార్యాలయాలు, క్యాడర్ పోస్టులను విలీనం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. 

ఇవి చదవండి: 

కొత్త జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు ఎలా?

30 వేల మంది SGT / SA టీచర్లకు.. త్వరలో ప్రమోషన్‌...

ఉదాహరణకు విద్యాశాఖలో డీఈవో, సమగ్ర శిక్ష అడల్ట్ ఎడ్యుకేషన్ కార్యాలయాలు వేర్వేరుగా ఉంటాయి. వాటికి ఒకే క్యాడర్లో ఉన్న హెచ్ఐడీలు వేర్వేరు గా ఉంటారు. కొత్త జిల్లాల్లో ఈ మూడు కార్యాలయాలను, ఈ మూడు హెచ్ఐవోడీ పోస్టులను విలీనం చేయాలని ప్రతిపా దించారు. విద్యాశాఖ జిల్లా కార్యాలయంగా వీటిని ఒకటిగా ఏర్పాటు చేసి ఒకే జిల్లా అధికారిని నియమిస్తారు. వైద్య, ఆరోగ్యశాఖలో డీఎంఅండాడో, ఏపీ వైద్యవిధాన పరిషత్ కార్యాలయాలు వేర్వేరుగా ఉండి వాటికి ఒకే క్యాడర్ లోని అధికారులు హెచ్వోడీలుగా ఉంటారు. ఆ రెండు కార్యాలయాలు, పోస్టులను విలీనం చేస్తారు. వ్యవసాయ, అటవీ, బీసీ, ఎస్సీ సంక్షేమ తదితర శాఖల్లో ఉన్న జిల్లా, డివిజనల్ స్థాయి కార్యాలయాలు, పోస్టులను విలీనం చేస్తారు. ఇలా విలీనం చేసిన తర్వాత కూడా కొత్త జిల్లాల్లో జిల్లా క్యాడర్ పోస్టులు సరిపోకపోతే జిల్లా క్యాడర్కు ఒక మెట్టు దిగువనున్న క్యాడర్ పోస్టులను అప్ గ్రేడ్ చేసి ఆ పోస్టు ల్లో నియమిస్తారు. అప్పటికీ అధికారులు సరిపోకపోతే కొత్త పోస్టులను సృష్టించాలని ఉన్నతాధికారుల కమిటీ ప్రతిపా దించింది. అలాగే ఆర్థికశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల విభజన చేపట్టాలని కలెక్టర్లు, ఆయా శాఖల హెచ్డీలను ఆదేశించారు. రివర్స్ సీనియారిటీ ప్రకారం జూనియర్ నుంచి సీనియర్ వారీగా జాబితాలు తయారుచేసి బదిలీలకు ఆప్షన్ ఇచ్చిన తర్వాత వారిని కొత్త జిల్లాల్లో నియమించనున్నారు.

READ: కొత్త జిల్లాలపై ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్..26 జిల్లాలు, నియోజకవర్గాల లిస్ట్ ఇదే..!

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad