AP NEW DISTRICTS :కొత్త జిల్లాల్లో ఉద్యోగుల విభజన అప్పుడే..!!

 కొత్త జిల్లాల్లో ఉద్యోగుల విభజన అప్పుడే..!!


ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా నడుస్తోందని ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయకుమార్ వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై మార్చి 3 దాకా అభ్యంతరాలు స్వీకరణ ఉంటుందన్నారు. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే కొత్త జిల్లాలలో ఉద్యోగుల విభజన ఇప్పుడు ఉండదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాతే ఉద్యోగుల విభజన ఉంటుందన్నారు. ఆర్డర్ టు వర్క్ ప్రాతిపదికన మాత్రమే కొత్త జిల్లాల్లో ఉద్యోగుల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు.

కాగా కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రాయలసీమ జిల్లాల నుంచి 1600 అభ్యంతరాలు అందాయని ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయకుమార్ తెలిపారు. అభ్యంతరాలు పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజిస్తూ ప్రభుత్వంలో గతంలో నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై మార్చి 15 నుంచి 17 మధ్య తుది నోటిఫికేషన్‌ జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత మార్చి 18న జిల్లాల్లో కలెక్టర్లు గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేస్తారు. ఏప్రిల్‌ 2 నుంచి కొత్త జిల్లాల కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. అదే రోజు నుంచి కొత్త జిల్లా కేంద్రాలుగా ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలు పనిచేయనున్నారు. పాత జిల్లాలకు కూడా వీరే ఇంఛార్జ్ కలెక్టర్లుగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad