AP PRC: ఐఆర్ అంటే వడ్డీలేని రుణం అని ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలోనూ లేదే

 AP PRC: ఐఆర్ అంటే వడ్డీలేని రుణం అని ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలోనూ లేదే..పీఆర్సీని కూడా రుణం అంటారేమో..


AP PRC : ఐఆర్ అంటే వడ్డీలేని రుణం అని ఏపీ సీఎస్ సమీర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఉద్యోగుల సంఘం నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఐఆర్ గురించి ప్రస్తావిస్తూ వడ్డీ లేని రుణం అని అన్న సీఎస్ మాటలు విని ఆశ్చర్యపోమని..అసలు ఐఆర్అంటే ఏమిటో కొత్త అర్థం తెలిసాక సీఎం వ్యాఖ్యలకు కొత్త అర్థం గురించి తెలుసుకోవటానికి మేము వికీపీడియా, ఆక్ష్ ఫర్డ్ డిక్షనరీలు కూడా వెతికామని కానీ ఐఆర్ అంటే వడ్డీ లేని రుణం అని ఎక్కడా లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు.

ఐఆర్ అంటే వడ్డీ లేని రుణం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇవాళ ఇచ్చిన పీఆర్సీని కూడా రేపు రుణం అంటారేమో అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికారులకు ఉన్నన్ని తెలివితేటలు మాకు లేవు అంటూ ఎద్దేవా చేశారు. ఐఆర్ అంటే మధ్యంతర ఉపశమనం అనే అన్ని చోట్లా ఉందని కానీ అధికారులు చెప్పే ఈ కొత్త అర్థాలు మాత్రం ఎక్కడా లేవని మరి తెలివితేలు ఏంటో వారికే తెలియాలంటూ చురకలు వేశారు సూర్యనారాయణ.

ఉద్యోగులు 13వ పీఆర్సీలో ఉండాల్సిన సమయంలో 11వ పీఆర్సీలో ఉన్నారని సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు రెండు పీఆర్సీలు కోల్పోయారని వెల్లడించారు.పీఆర్సీ కమిషన్ రిపోర్టు ఇచ్చి తీరాల్సిందేనంటూ ఆయన డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదిక పొందడం తమ హక్కు అని స్పష్టం చేశారు. ఇవాళ్టి పీఆర్సీ సాధన సమితి సమావేశంలోనూ ఇదే తీర్మానం చేశామని చెప్పారు. కనీస వేతనంపై కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ 2018లో నివేదిక ఇచ్చిందని, అయితే పీఆర్సీపై అశుతోష్ మిశ్రా కమిటీ కేంద్ర కమిటీ నివేదికను అనుసరించిందా.. లేదా? అని సూర్యనారాయణ ప్రశ్నించారు

ఇప్పటికే ఉద్యోగులురెండుసార్లు సీఆర్సీ కోల్పోయారని..మా హక్కుల్ని మేం అడుగుతుంటే మామీద దాడులు చేయిస్తారా?అక్రమ నిర్భంధాలు చేస్తారా? అక్రమంగా అరెస్ట్ లు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్లతో వైసీపీ ప్రభుత్వం కాలం గడుపుతోందని..పీఆర్సీ కమిషన్ రిపోర్టు ఇచ్చి తీరాల్సిందేనని ఈ సందర్భంగా సూర్యనారాయణ డిమాండ్ చేశారు

కాగా..ఛలో విజయవాడ కార్యక్రమంతో ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణను బలంగా చాటిన తరువాత వారి కార్యక్రమం అత్యంత విజయవంతం అయినందుకు ఉద్యోగులంతా సంతోషం వ్యక్తంచేస్తున్నారు.ప్రభుత్వం ఎన్ని నిర్భంధాలు విధించినా మా న్యాయమైన హక్కుల కోసం నిననిందే మా గొంతులను ఆపలేకపోయారని సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఆ జోష్ లోనే ఈరోజు సమావేశమైన ఉద్యోగ సంఘాల నేతల భవిష్యత్ కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad