Pistachios Benefits: మీరు సన్నగా అవ్వాలని అనుకుంటే రోజు పిస్తా తినండి.. ఎందుకంటే..?

 Pistachios Benefits: మీరు సన్నగా అవ్వాలని అనుకుంటే   రోజు పిస్తా తినండి.. ఎందుకంటే..?

istachios Benefits: ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తప్పనిసరిగా తినాలి. అందులో జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్‌, పిస్తా వంటి అన్ని డ్రై ఫ్రూట్స్‌ వస్తాయి. మీరు వాటిని ఖచ్చితంగా ఆహారంలో చేర్చుకోవాలి. కానీ బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే పిస్తాపప్పులను తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే పిస్తా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అనేక రకాల విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఇందులో ఉంటాయి. పిస్తాలో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది

రోజూ పిస్తాపప్పు తినడం ద్వారా శరీరానికి చాలా ఫైబర్ అందుతుంది. చాలా సేపు పొట్ట నిండుగా ఉంటుంది. ఆకలి అనుభూతి ఉండదు. దీనివల్ల అతిగా తినడం నివారించవచ్చు. దీంతో బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిక్ రోగులకు పిస్తాపప్పులు చాలా మేలు చేస్తాయి. పిస్తాపప్పులు తింటే డయాబెటిక్ పేషెంట్లలో గ్లైసెమిక్ స్థాయి, రక్తపోటు, వాపు, ఊబకాయం వంటి సమస్యలు తగ్గుతాయని చాలా పరిశోధనల్లో తేలింది


పిస్తాలో ఐరన్, కాపర్ పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల రక్తహీనత వంటి సమస్యలు తొలగిపోయి శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. పిస్తాపప్పులో విటమిన్ బి కూడా ఉంటుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. పిస్తాపప్పులు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. విటమిన్ B6, జింక్ ఇందులో ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. పిస్తాపప్పులో ల్యూటిన్, జియాక్సంథిన్, జింక్ ఉంటాయి. ఇవి కళ్లకు, మెదడుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad