SBI Account Balance: మీ SBI అకౌంట్ BALANCE ఎంత? సింపుల్‌గా తెలుసుకోవచ్చు ఇలా

 SBI Account Balance: మీ SBI  అకౌంట్ BALANCE ఎంత? సింపుల్‌గా తెలుసుకోవచ్చు ఇలా


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)... భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ. ఎస్‌బీఐ బ్యాంకింగ్ నెట్వర్క్ గ్రామగ్రామానికి విస్తరించింది. ఎస్‌బీఐలో 40 కోట్లకు పైగా కస్టమర్లు (SBI Customers) ఉన్నారు. 22 వేలకు పైగా ఎస్‌బీఐ బ్రాంచులు ఉన్నాయి. నిత్యం కోట్లాది మంది కస్టమర్లు ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవలు (Banking Services) పొందుతున్నారు. ఒకప్పుడు బ్యాంకు అకౌంట్‌లో బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. ఆ తర్వాత ఏటీఎంలు రావడంతో బ్యాలెన్స్ తెలుసుకోవడం కాస్త సులువైంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడంతో ఎస్‌బీఐ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి అనేక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. మరి మీరు ఎస్‌బీఐ కస్టమర్ అయితే మీ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉందో ఈ కింది పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చు

ALSO READ

SBI 3 in 1 offer: SBI ఖాతాదారులకు బంపర్ ఆఫర్..!

SBI Loans: Online లో సుల‌భంగా SBI ప్రీ అప్రూవ్డ్ ప‌ర్స‌న‌ల్‌ లోన్స్‌

SBI వినియోగదారులకు శుభవార్త.. తక్కువ వడ్డీకే 3 రకాల లోన్స్!

SMS: మొబైల్ నెంబర్ ద్వారా ఎస్ఎంఎస్ పంపి అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. BAL అని టైప్ చేసి 09223766666 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా తెలుస్తాయి. అయితే కస్టమర్లు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారానే ఎస్ఎంఎస్ పంపాలి. ఒకవేళ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయనట్టైతే REGAccount Number అని టైప్ చేసి 09223488888 నెంబర్‌కు పంపాలి.

Missed Call: ఎస్‌బీఐ కస్టమర్లు రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. 09223766666 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి. ఈ నెంబర్ పనిచేయకపోతే 09223866666 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే మినీ స్టేట్‌మెంట్ ఎస్ఎంఎస్‌లో వస్తాయి.

USSD Number: అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా నెంబర్ (USSD) ద్వారా కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు ఇందుకోసం ముందుగా MBSREG అని టైప్ చేసి 567676 లేదా 0922344000 నెంబర్లకు ఎస్ఎంఎస్ పంపి రిజిస్టర్ చేయాలి. యూజర్ ఐడీ, ఎంపిన్ వచ్చిన తర్వాత *595# టైప్ చేసి బ్యాలెన్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఎంపిన్ ఎంటర్ చేస్తే బ్యాలెన్స్ తెలుస్తుంది.

Internet Banking: ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో లాగిన్ అయి ఎస్‌బీఐ ఖాతాదారులు తమ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అయితే లాగిన్ చేయడానికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ లాంటి వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి.

YONO: ఎస్‌బీఐ కస్టమర్లకు యోనో ఎస్‌బీఐ యాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. కస్టమర్లు ముందుగా యోనో ఎస్‌బీఐ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ తర్వాత బ్యాలెన్స్ ఎంక్వైరీ సెక్షన్‌లో అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

ATM: ఎస్‌బీఐ కస్టమర్లు ఏటీఎంలో కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ స్వైప్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత 4 అంకెల పిన్ ఎంటర్ చేయాలి. అకౌంట్ బ్యాలెన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad