WhatsApp: వాట్సాప్‌ యూజర్లకు కొత్త తలనొప్పి..! యాప్‌లో సమస్య..వెంటనే ఇలా చేయండి..

 WhatsApp: వాట్సాప్‌ యూజర్లకు కొత్త తలనొప్పి..! యాప్‌లో సమస్య..వెంటనే ఇలా చేయండి..


ఒపెన్‌ చేస్తే ఎర్రర్‌..!

వాట్సాప్‌ బీటా యూజర్లు యాప్‌ను ఓపెన్‌ చేసినప్పుడు లేదా మీడియాను షేర్‌ చేసినప్పుడు ఎర్రర్‌ వచ్చినట్లు పలువురు యూజర్లు నివేదించారు. ఈ సమస్యకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. అయితే వాట్సాప్‌ బీటా ఫర్‌ ఆండ్రాయిడ్‌ యాప్‌ క్రాష్‌ అవుతున్నట్లు మెటా కూడా నిర్థారించింది. యాప్‌ క్రాష్‌కు కారణమైన బగ్‌కు మెటా పరిష్కారాన్ని కూడా చూపింది. 

ఇలా చేస్తే సెట్‌..!

వాట్సాప్‌ ట్రాకర్‌ WABetaInfo ప్రకారం..కొత్త మంది బీటా యూజర్లకు యాప్‌ క్రాష్‌ సమస్య వస్తోన్నట్లు నివేదించింది. వాట్సాప్‌ బీటా ఫర్‌ ఆండ్రాయిడ్‌  2.22.4.6, 2.22.4.7 వెర్షన్ల యూజర్లు మీడియాను ఇతర యూజర్లతో షేర్‌ చేస్తున్నప్పుడు క్రాష్‌ అవుతున్నట్లు సమాచారం. ఈ సమస్యకు మెటా పరిష్కారాన్ని చూపింది. వాట్సాప్‌ బీటా  2.22.4.6, 2.22.4.7 వెర్షన్లను వాడే యూజర్లను వెంటనే 2.22.4.8 వెర్షన్‌కు అప్‌డేట్‌ చేయాలని మెటా సూచించింది. వాట్సాప్‌ యూజర్ల డేటాను భద్రంగా ఉంచేందుకుగాను ఆయా యూజర్లు తమ గూగుల్‌ డ్రైవ్‌తో బ్యాకప్‌ చేసుకోవాలని వాట్సాప్‌ ట్రాకర్‌ WABetaInfo తెలిపింది.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad