AP NEW CABINET: ఆ మంత్రులు సైతం ఔట్ - కొనసాగేది వీరే : కొత్త స్పీకర్ ఖరారు..!!

 


ఆ మంత్రులు సైతం ఔట్ - కొనసాగేది వీరే : కొత్త స్పీకర్ ఖరారు..!!

2024 ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అటు పార్టీలో - ఇటు ప్రభుత్వంలో అవసరమైన మార్పుల దిశగా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా.. ప్రధానంగా ప్రభుత్వ పరంగా కేబినెట్ కూర్పు పైన ఫోకస్ పెట్టారు. ప్రస్తుత మంత్రులు సామాజిక సమీకరణాల కారణంగా నలుగురైదుగురు మినహా మిగిలిన వారిని తప్పించాల్సి ఉంటుందని సీఎం జగన్ నేరుగా కేబినెట్ సమావేశంలోనే స్పష్టం చేసారు. ప్రస్తుతం కొనసాగుతున్న కేబినెట్ కూర్పు సమయంలోనే జగన్ ఒక క్లారిటీ ఇచ్చారు. రెండున్నారేళ్ల తరువాత ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 90 శాతం వరకు మార్పు ఉంటుందని నాడే స్పష్టంగా చెప్పారు. ఇక, ప్రస్తుతం కేబినెట్ కూర్పులో భాగంగా.. ఎవరిని కొనసాగిస్తారు.. ఎవరిని తప్పిస్తారనే చర్చ అసెంబ్లీ సమావేశాల సమయంలో లాబీల్లో కొనసాగుతోంది.

తప్పించే మంత్రులతో నేరుగా సీఎం జగన్ స్వయంగా ప్రస్తుతం మంత్రులుగా ఉంటూ..తప్పించాలని భావిస్తున్న వారితో నేరుగా..వారు ఎక్కడా హర్ట్ కాకుండా... వారితో స్వయంగా కేబినెట్ నుంచి తప్పిస్తున్న వారికి తన నిర్ణయం గురించి వివరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా.. శ్రీకాకుళం నుంచి ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ధర్మాన క్రిష్ణదాస్.. సిదిరి అప్పలరాజు ను తప్పించనున్నట్లు సమాచారం. ధర్మాన క్రిష్ణదాస్ ను తప్పించి ఆయన స్థానంలో సోదరుడు ధర్మాన ప్రసాద రావును కేబినెట్ లోకి తీసుకోనున్నారు. అదే విధంగా అదే జిల్లా నుంచి స్పీకర్ గా కొనసాగుతున్న తమ్మినేని సీతారాం ను సైతం కేబినెట్ లోకి తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయన స్థానంలో విజయనగరం జిల్లా ఎస్టీ వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే పీ రాజన్నదొరను స్పీకర్ గా చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

Also read

కార్ కొనేవారికి ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే ఆఫర్

SBI: రూ.342 చెల్లిస్తే చాలు.. రూ.4 లక్షల ప్రయోజనం..!

ఏడేళ్లలో మీ పిల్లల పేరుతో రూ.11 లక్షలు రిటర్న్స్ పొందొచ్చు

SBI ATM ఫ్రాంచైజీ: నెలకి రూ.80 వేలు సంపాదించే అవకాశం

స్పీకర్ మార్పు.. ఎస్టీ వర్గానికి ఇచ్చేలా ఇప్పటి వరకు ఎస్టీ వర్గానికి స్పీకర్ హోదా దక్కలేదు. దీంతో.. ఇప్పటి వరకు శాసనసభలో స్పీకర్ గా బీసీ వర్గానికి..మండలిలో చైర్మన్ హోదా ఎస్సీ వర్గానికి.. డిప్యూటీ ఛైర్మన్ గా మైనార్టీ మహిళకు అవకాశం ఇచ్చారు. దీంతో..ఎస్టీ వర్గానికి స్పీకర్ పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, టీడీపీ సభలో నిరసనలు తీవ్రం చేస్తున్న వేళ.. చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగితే మినహా..స్పీకర్ గా రాజన్న దొర నియామకం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, సీనియర్లలో బొత్సా...కొడాలి నాని సైతం కేబినెట్ నుంచి తప్పుకోనున్నారని విశ్వసనీయ సమాచారం. వారితో పాటుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని సీఎం ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది, అయితే, పెద్దిరెడ్డి విషయంలో ఇంకా తుది నిర్ణయం జరగలేదు.

బొత్సా - కొడాలి నాని కి పార్టీ బాధ్యతలు కొడాలి నాని - బొత్సాలకు కోస్తాంధ్ర లో పార్టీ బాధ్యతలను అప్పగించనున్నారు. కొడాలి నాని స్థానంలో కమ్మ వర్గం నుంచి ఎమ్మెల్సీ తలశిల రఘురాం లేదా వసంత క్రిష్ణ ప్రసాద్ కు కేబినెట్ లో అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఇక, హోం మంత్రి సుచరిత స్థానంలో మరో మహిళకు ఆ పదవి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సారి బీసీ మహిళకు హోం మంత్రి పదవి ఇవ్వాలనే సమీకరణం పైన ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత మంత్రుల్లో పేర్ని నాని.. కన్నబాబు తో పాటుగా బుగ్గన రాజేంద్రనాధ్ కేబినెట్ లో కొనసాగటం ఖాయమని తెలుస్తోంది. అదే విధంగా కొత్త జిల్లాలు అందుబాటులోకి వస్తుండటంతో.. పక్కాగా సామాజిక - ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా కేబినెట్ కూర్పు జరగనుంది.

పార్టీ ప్లీనరీ వేదికగా సమరశంఖం జూలై 8న పార్టీ ప్లీనరీ వేదికగా 2024 ఎన్నికలకు జగన్ సమరశంఖం పూరించేందుకు సిద్దమయ్యారు. అక్కడ నుంచి పూర్తిగా ఎన్నికలే లక్ష్యంగా అటు ప్రభుత్వంలో..ఇటు పార్టీలో అడుగులు పడనున్నాయి. సీనియర్ మంత్రులను సైతం పార్టీ బాధ్యతల్లో నిమగ్నం చేయటం.. ఎస్టీ వర్గానికి స్పీకర్.. బీసీ మహిళకు హోం మంత్రి పదవులతో జగన్ కొత్త కేబినెట్ రూపుదిద్దుకుంటున్నట్లుగా పార్టీలోని ముఖ్య నేతల సమాచారం. సీనియర్ మంత్రులను కేబినెట్ నుంచి తప్పించి పార్టీ సేవల కోసం వారిని వినయోగించుకోవాలని భావిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే..తిరిగి వారికే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీంతో.. ప్రస్తుత కేబినెట్ లోకి ఎవరికి కొత్తగా ఛాన్స్ దక్కుతుందనే లెక్కలతో వైసీపీ ఎమ్మెల్సీలు - ఎమ్మెల్యేలు మంతనాల్లో బిజీగా మారిపోయారు. జగన్ నిర్ణయం వైపు ఆసక్తిగా చూస్తున్నారు.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad