AP NEW DISTRICTS : కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

 కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం శాసన సభలోని తన చాంబర్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. కొత్తగా ఏర్పాటయ్యే 13 జిల్లాల్లో ఉగాది పండుగ నుంచి పరిపాలన కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ALSO READ:

కొత్త జిల్లాల ఏర్పాటు.... ఉద్యోగుల కేటాయింపు...ఆర్డర్‌ టూ సర్వ్‌ ఉత్తర్వులు


ప్రధానంగా ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతులపై సీఎం అధికారులతో కూలంకషంగా చర్చించారు. ఈ వినతులను పరిగణనలోకి తీసుకొని ఈ నెల 29వ తేదీన కొత్త జిల్లాల తుది రూపం ఖరారు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అధికారులు ముందుగా ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన వినతులను సీఎంకు వివరించారు. వాటిపై సీఎం లోతుగా చర్చించారు. ఎచ్చర్లను శ్రీకాకుళం జిల్లాలోనే ఉంచేందుకు సీఎం అంగీకరించారని గురువారం అసెంబ్లీలో సీనియర్‌ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చెప్పిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు శాసన సభ్యులు కొత్త జిల్లాలపై తమ విజ్ఞప్తులను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నింటిపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. వీటిని పరిగణనలోకి తీసుకొని కొత్త జిల్లాలకు తుది రూపం ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad